ప్రపంచ వ్యాప్తంగా భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. భారత్ లో ఒక్కరోజే రూ. 10 లక్షల కోట్లు

www.mannamweb.com


సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆర్థిక మాంద్య భయాలతో ఇంటర్నేషన్ల్ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు భారత స్టాక్ మార్కెట్ సూచీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 9:23 గంటల సమయంలో సెన్సెక్స్‌ 1,502 పాయింట్లు నష్టపోయి 79,479 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 466 పాయింట్లు కోల్పోయి 24,251 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.78 వద్ద ప్రారంభమైంది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా స్టార్ మార్కెట్ కుప్పకూలిన నేపథ్యంలో భారత్ లో ఒక్క రోజులోనే దాదాపు రూ.10 లక్షల కోట్లు ఆవిరయ్యాయి.

అమెరికా ఆర్థిక వ్యవస్థలో మాంద్యం భయాలతో ప్రపంచ మార్కెట్లు కుప్పకూలడంతో సోమవారం సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా రెండో సెషన్‌లోనూ పతనమయ్యాయి. అంతకుముందు సెషన్‌లో నమోదైన రూ.457.16 లక్షల కోట్ల విలువతో పోలిస్తే పెట్టుబడిదారుల సంపద రూ.10.24 లక్షల కోట్లు తగ్గి రూ.446.92 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే ఒక్కరోజులోనే ఏకంగా రూ. 10 లక్షల కోట్ల నష్టం జరిగింది. ఈ రోజు ప్రారంభ ట్రేడింగ్‌లో నిఫ్టీ 479 పాయింట్లు పడిపోయి 24,238 వద్ద ఉంది. అలానే సెన్సెక్స్ 1,563 పాయింట్లు క్షీణించి 79,419 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.78 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 సూచీలో సన్‌ ఫార్మా, హెచ్‌యూఎల్‌ షేర్లు మాత్రమే లాభాల్లో ఉండడం గమనార్హం. టాటా మోటార్స్‌, మారుతీ, టైటన్‌, టాటా స్టీల్‌, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, ఎల్‌ అండ్‌ టీ, బజాజ్‌ ఫైనాన్స్‌, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫిన్‌సర్వ్, ఎం అండ్‌ ఎం, రిలయన్స్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ వంటి కీలక కంపెనీల షేర్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, టైటాన్ వంటి స్టాక్స్ సెన్సెక్స్ 5.04శాతం వరకు పడిపోయాయి. సెన్సెక్స్‌లోని టాప్ 30 షేర్లలో 28 నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

46 నిఫ్టీ స్టాక్స్ కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీలో టాటా మోటార్స్, హిందాల్కో, ఓఎన్ జీఎస్, శ్రీరామ్ ఫైనాన్స్, జేఎస్ఎడబ్ల్యూ స్టీల్ టాప్ లూజర్‌లుగా ఉన్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 77.16 డాలర్ల వద్ద కొనసాగుతోంది. శుక్రవారం
విదేశీ సంస్థాగత మదుపర్లు నికరంగా రూ.3,310 కోట్ల విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే విధంగా దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.2,966 కోట్ల వాటాలను కొనుగోలు చేశారు. మొత్తంగా నేడు ప్రపంచం వ్యాప్తంగా స్టాక్ మార్కెట్ నష్టాల్లో పయణిస్తుంది.