ఆ సిరప్‌ను వాడటం నిలిపివేయండి.. తెలంగాణ డ్రగ్స్

పిల్లల కోసం వినియోగించే ఆల్మంట్ కిడ్ సిరప్ వినియోగాన్ని నిలిపివేయాలని తెలంగాణ ఔషధ నియంత్రణ మండలి ( డీసీఏ) ఆదేశించింది. ఈ సిరప్‌లో ఇథలీన్ గ్లైకాల్ ప్రమాదకరంగా ఉన్నట్లుగా గుర్తించిన నేపథ్యంలో ఈ హెచ్చరికలు చేసింది.


బిహార్‌కు చెందిన ట్రిడస్ రెమెడీస్ సంస్థ తయారు చేసిన AL 24002 బ్యాచ్ సిరప్‌ల్లో కల్తీ జరిగిందని పశ్చిమ బెంగాల్‌లో గుర్తించారు. ఈ నేపథ్యంలో కోల్‌కతాలోని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనేషన్ నుంచి హెచ్చరికలు అందాయి. ఈ నేపథ్యంలో ఈ బ్యాచ్ సిరప్ ఎవరి వద్దనైనా ఉంటే.. వాడకం ఆపేయాలని.. అలాగే మార్కెట్‌లోనూ విక్రయాలను నిలిపివేయాలని తెలంగాణ డీసీఏ డైరెక్టర్ జనరల్ షానవాజ్ ఖాసిం ఆదేశించారు. పిల్లలకు వాడే సిరప్ కావడంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వాడకూడని సిరప్‌ వివరాలివే..

మందు పేరు: Almont-Kid Syrup
బ్యాచ్‌ నం: AL-24002
తయారీ తేదీ: Jan-2025
గడువు తేదీ: Dec-2026
దీనిపై సమాచారం లేదా ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబరు 1800-599-6969లో సంప్రదించాలని సూచించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.