కాల్ చేస్తే స్క్రీన్‌లో వింత మార్పులు.. ఆందోళనలో ప్రజలు.. స్కామ్?

 మీరు గమనించారా? మీ ఫోన్‌లో ఏదైనా మార్పులు కనిపించాయా? కాల్ చేస్తే పెద్ద పెద్ద అక్షరాలు వచ్చేస్తున్నాయా? స్క్రీన్‌పై యాడ్ కాల్, వీడియో కాల్, రికార్డ్, హోల్డ్, యాడ్ మై కెమెరా, స్పామ్, ఆల్ కాల్స్, మిస్డ్ కాల్స్ అంటూ డేటా మొత్తం వచ్చేస్తోందా?


ఇదేంది అనే ఆందోళనలో ఉన్నారా? నో వర్రీస్.. ఇదంతా అప్‌డేట్‌లో భాగమంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా వన్ ప్లస్, రియల్ మీ, మోటో, ఒప్పో ఫోన్లలో ఈ మార్పులు కనిపించగా.. ఈ చేంజెస్ యూజర్ అనుభవాన్ని మరింత సింప్లిఫై చేయడం, కాలింగ్ ఇంటర్ ఫేజ్ మెరుగుపరచడమే లక్ష్యంగా కొనసాగుతోంది. ఆపరేటింగ్ సిస్టమ్స్, గూగుల్ స్టాక్ ఆండ్రాయిడ్ బేస్డ్ న్యూ ఫీచర్స్‌ను ఇంట్రడ్యూజ్ చేస్తున్నాయి పలు బ్రాండ్స్.

రియల్ మీ : Realme UI 3.0, 4.0 వంటి వెర్షన్‌లలో Google Phone యాప్‌ను ఇంటిగ్రేట్ చేసింది. కొన్ని సిరీస్‌ల్లో తమ సొంత డయలర్‌లో స్పామ్ డిటెక్షన్ ఫీచర్‌ను జోడించింది.

వన్‌ప్లస్ : OxygenOS 12, 13లో Google Phone యాప్ డిఫాల్ట్‌గా వస్తుంది. ఇందులో సైడ్ స్లైడ్, స్పామ్ ఫిల్టరింగ్ ఫీచర్స్ జోడించబడ్డాయి.

మోటో: Motorola స్టాక్ ఆండ్రాయిడ్‌కు దగ్గరగా ఉండే ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది. కాబట్టి Google Phone యాప్‌లోని కొత్త ఫీచర్లు ఎక్స్‌పరీయన్స్ చేస్తున్నారు యూజర్స్.

ఒప్పో: ColorOS 12, 13లో Google Phone యాప్ లేదా సొంత డయలర్‌లో స్పామ్ గుర్తింపు, సైడ్ స్లైడ్ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది.

స్పామ్ కాల్స్ మేనేజ్మెంట్ : స్పామ్ కాల్స్‌ను గుర్తించడానికి ఈ బ్రాండ్‌లు Truecaller లేదా Google స్పామ్ ప్రొటెక్షన్‌ను యూజ్ చేస్తున్నాయి. జియో, ఎయిర్‌టెల్, బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్స్‌లో స్పామ్ కాల్స్ బ్లాక్ చేసేందుకు డు నాట్ డిస్టర్బ్ సెట్టింగ్స్ ఆన్ చేస్తే సరిపోతుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.