పాతబస్తీలో విచిత్ర ఘటన.. ఉచితంగా జ్యూస్ పంచిన యువకుడు: చివరకు ఏమైందంటే?

హైదరాబాద్(Hyderabad) పాతబస్తీలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. డబీర్‌పుర(Dabeerpura)లో మధ్యాహ్నం ఓ యువకుడు రోడ్లమీద తిరుగుతూ అందరికీ ఉచితంగా జ్యూస్ ప్యాకెట్లు పంపిణీ చేశాడు. అయితే ఆ జ్యూస్ తాగిన వారంతా ఎక్కడి వారు అక్కడే నిద్రలోకి జారుకున్నారు. నిద్ర లేచిన తర్వాత అందరూ అయోమయ స్థితిలోకి వెళ్లారు. అనంతరం ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. పలుచోట్ల ఇదే తరహా పేషెంట్లు ఆసుపత్రుల్లో చేరడంతో.. ఆ జ్యూస్ పంపిణీ చేసిన యువకుడి కోసం గాలిస్తున్నారు. పాతబస్తీ మొత్తం అతడు తిరిగిన ప్రాంతాల్లో సీసీ టీవీలు చెక్ చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఖురాన్‌ పఠనం పూర్తి చేసుకున్నానని.. ఆనందంగా జ్యూస్‌ పంచుతున్నానని చెప్పిన సదరు యువకుడు చెప్పడంతో జ్యూస్ స్వీకరించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.