Success Story: రూ.1500 జీతం నుంచి రూ.3 కోట్ల ఆదాయం.. ఈ యువకుడు పలువురికి ఆదర్శం..

Success Story: ఓ యువకుడు తను ఎంచుకున్న మార్గాన్ని చేరడానికి విపరీత ప్రయత్నాలు చేశాడు. చివరికి లక్స్యానికి చేరువవుతున్నాడు. ఇంతకీ అసలు స్టోరీ ఏంటంటే?


Success Story: జీవితంలో గొప్పగా ఎదగాలని ఎవరికైనా ఉంటుంది. అయితే కొందరు గమ్యాన్ని చేరుకోవడానికి తీవ్రంగా కష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలో ఎన్నో ఎదురుదెబ్బలు ఉండొచ్చు. వాటికి భయపడకుండా ముందుకు వెళ్తేనే లక్ష్యాన్ని చేరుకుంటారు. ఇలాంటి విషయాలను బగా పసిగట్టిన వాళ్లు జీవితంలో సక్సెస్ అవుతారు. ఇదే కోవలో ఓ యువకుడు తను ఎంచుకున్న మార్గాన్ని చేరడానికి విపరీత ప్రయత్నాలు చేశాడు. చివరికి లక్స్యానికి చేరువవుతున్నాడు. ఇంతకీ అసలు స్టోరీ ఏంటంటే?

అష్పాక్ సునావాల.. ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందుకంటే ఇతను రూ. 1500 జీతానికి ఒకప్పుడు పనిచేశాడు. ఇప్పుడు నెలకు రూ.3 కోట్ల ఆదాయం పొందుతున్నాడు. ఎలాంటి అండాదండా లేకున్నా.. స్వయం శక్తితో ఎన్నో కష్టాలు పడి ఇక్కడికి చేరుకున్నాడు. అయితే ఇంతటితో తన లక్ష్యం పూర్తికాలేదని, ఇంకా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన చెబుతున్నాడు. అసలు విషయమేంటంటే అష్పాక్ సునావాల చదివింది 10వ తరగతి మాత్రమే.

అష్పాక్ సునావాల 10 తరగతి వరకు చదివి మధ్యలోనే ఆపేశాడు. ఆ తరువాత 2004లో రిటైల్ స్టోర్ లో రూ.1500 జీతంతో పనికిచేరాడు. అయితే జీవితంలో ఎప్పటికైనా అత్యున్నత స్థాయిలో ఉండాలని అతని కోరిక. అందుకు అన్ని రకాలుగా కష్టాలు పడ్డాడు. దాదాపు 10 ఏళ్ల పాటు వివిధ ఉద్యోగాలు చేస్తూ కొత్త ఉద్యోగాలను వెతుక్కున్నాడు. ఈ క్రమంలో 2013లో సునావాల రైడ్ హెయిలింగ్ యాప్ ప్రకటనను చూశాడు. ఈ కంపెనీ ప్రకటించిన స్కీమ్ సహాయంతో ఓ చిన్న కారును కొనుగోలు చేశాడు.

అయితే ఉదయం 7 నుంచి కారు నడుపుతూ ఆ తరువాత రెగ్యులర్ ఉద్యోగానికి వెళ్లేవాడు. ఇలా ఉద్యోగం ద్వారా నెలకు రూ.35 వేలు, పార్ట్ టైం కారు నడుపుతూ రూ.15 వేలు సంపాదించేవాడు. ఆ తరువాత రెండో కారును కొనుగోలు చేశాడు. ఈ రెండు కార్లను నడపగా వచ్చిన ఆదాయంతో మరో మూడు కార్లను కొనుగోలు చేశాడు. వీటికి డ్రైవర్లను నియమించుకున్నాడు. ఇలా వచ్చిన ఆదాయంతో కార్లను కొనుగోలు చేస్తూ వచ్చాడు. ప్రస్తుతం అతని వద్ద 400 కార్లు ఉన్నాయి.

అయితే 500 కార్లను ఉంచుకోవాలనేది అతని టార్గెట్. అయితే ప్రస్తుతం అతనికి వార్షిక ఆదాయంగా రూ.36 కోట్లు వస్తుంది. అంటే నెలకు రూ.3 కోట్లు న్నమాట. ఉద్యోగంలో రాజీనామాలు, తప్పుడు ప్రవర్తన వంటి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. కోట్ల రూపాయల ఆదాయంతో హ్యాపీగా ఉంటున్నట్లు అష్పాక్ సునావాల తెలుపుతున్నాడు.