Sugarcane Juice: అలాంటి వారు చెరుకు రసం అస్సలు తాగకూడదు.. ఎందుకో తెలుసుకోండి..

www.mannamweb.com


Sugarcane Juice: వేసవిలో శరీరాన్ని చల్లగా, తాజాగా ఉంచేందుకు చెరుకు రసం తాగడం చాలా మంచిది.
చెరకు రసంలో మంచి మొత్తంలో శక్తి, ఖనిజాలు, కాల్షియం, ఐరన్, పొటాషియం ఉన్నాయి.

కావున వేసవిలో చెరుకు రసం తాగడం మంచిది. కానీ చెరకు రసం అందరికీ మంచిది కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చెరకు రసం తాగడం వల్ల కూడా కొంతమందికి హాని కలుగుతుంది.

ఫుడ్ పాయిజనింగ్, స్థూలకాయం, జలుబు, దగ్గు ఉన్న వారు చెరుకు రసం అస్సలు తీసుకోకూడదు అని పేర్కొంటున్నారు.

ఇలాంటి పరిస్థితిలో ఎలాంటి వ్యక్తులు చెరకు రసాన్ని తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇలాంటి వారు చెరుకు రసం తాగకూడదు.

ఫుడ్ పాయిజనింగ్: ఫుడ్ పాయిజన్‌తో బాధపడేవారు చెరుకు రసం అస్సలు తాగకూడదు.

ఎందుకంటే ఇది సమస్యను మరింత పెంచుతుంది. ఎందుకంటే చెరుకు రసాన్ని ఆరు బయట తయారు చేస్తారు.

ఈ సమయంలో ఈగలు, దుమ్ము లాంటివి చెరకు గడలపై ఉంటాయి. ఇది చెరకు రసాన్ని అనారోగ్యకరమైనదిగా చేస్తుంది. అందుకే హాని కలిగించవచ్చు.

తలనొప్పి: చెరకు రసం తలనొప్పిని కూడా ప్రేరేపిస్తుంది. తలనొప్పి సమస్య ఉంటే చెరుకు రసం తాగడం మానుకోండి. ఎందుకంటే చెరుకు రసం తాగడం వల్ల మీ సమస్య మరింత తీవ్రమవుతుంది.

జలుబు-దగ్గు: జలుబు చేసినప్పుడు చెరుకు రసం తాగకూడదు. ఎందుకంటే చెరకు రసం చల్లదనాన్ని కలిగి ఉంటుంది. ఇది జలుబు, దగ్గు సమస్యను మరింత పెంచుతుంది.

ఊబకాయం: అధిక బరువుతో బాధపడుతున్నవారు చెరకు రసం తాగడం మానుకోండి. చెరకు రసం తాగడం వల్ల శరీరంలో కేలరీలు పెరుగుతాయి.

ఇది బరువును మరింత పెంచుతుంది. కాబట్టి ఊబకాయం ఉన్నవారు చెరుకు రసాన్ని తీసుకోకూడదు.