సుకన్య సమృద్ది యోజన స్కీమ్ తో అమ్మాయిలకు రూ.46 లక్షలు

www.mannamweb.com


కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. మహిళలు, రైతులు, వృద్ధులు, యువత, విద్యార్థులు, అమ్మాయిలు, చిన్నపిల్లలు.. ఇలా అన్ని వర్గాల వారికీ అనేక రకాల పథకాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఇదే సమయంలో ఆడపిల్లల కోసం ఓ అద్భుతమైన పథకాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం అందిందిస్తుంది. ఈ స్కీమ్ ద్వారా అమ్మాయిలకు లక్షల్లో డబ్బులు అందుతాయి. ఇంతకీ కేంద్రం అదిస్తున్న ఆ అదిరిపోయే స్కీమ్ ఏమిటి?. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లల భవిష్యత్తు కోసం ‘సుకన్య సమృద్ధి యోజన’ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసింది. అమ్మాయిల భవిష్యత్ కోసం కేంద్రం ప్రత్యేకంగా ఈ స్కీమ్ ను రూపొందించింది. ఆడపిల్లల చదువు, పెళ్లిళ్ల విషయంలో ఉండే ఆర్థిక భయాలను తొలగించాలనే ఉద్దేశంతోనే ఈ స్కీమ్ ను ప్రారంభించారు. పదేళ్ల లోపు ఉన్న ఆడపిల్లలు ఈ స్కీమ్ లో చేరేందుకు అర్హులు. కవల అమ్మాయిలు ఉన్నవారు సులభంగా ఉమ్మడి అకౌంట్ ను తెరవచ్చు. సుకన్య సమృద్ధి యోజన మెచ్యూరిటీ సమయంలో అమ్మాయిలకు అవరసమైన మేర డబ్బులు వస్తాయి. ఈ పథకంలో కచ్చితమైన హామీతో డబ్బులు వస్తాయి.

సుకన్య సమృద్ధి యోజనలో ఏడాదికి కనీసం 250 పెట్టుబడిగా పెట్టవచ్చు. అలానే గరిష్టంగా లక్షన్నర రూపాయాలను పెట్టుబడిగా పెట్టొచ్చు. ఈ పథకం కింద పెట్టుబడి పెట్టిన వారికి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతానికి 8.2 శాతం వడ్డీని అందిస్తోంది. భవిష్యత్ లో ఈ వడ్డీ రేటులో మార్పు కూడా జరగవచ్చు. ఇందులో 15 ఏళ్ల వరకు నిరంతరం పెట్టుబడి పెట్టాలి. మీ కుమార్తెకు 21 ఏళ్లు వచ్చిన తర్వాత డబ్బులు వస్తాయి. ఈ పథకంలో ఎవరైనా తమ కుమార్తె కోసం ఏడాదికి లక్ష పెట్టుబడి పెడితే, అది మీరు ప్రతి నెలా రూ. 8,334 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అలా మీ మొత్తం పెట్టుబడి 15 ఏళ్లకు రూ. 15 లక్షలు పెట్టుబడి అవుతోంది. ఆ తరువాత అమ్మాయికి 21 ఏళ్లు వచ్చే వరకు అకౌంట్ అలానే ఉంచాలి.. ఈ క్రమంలోనే సదరు అమ్మాయి..రూ.31,18,385 వడ్డీని పొందుతారు.

అసలు, వడ్డీ మొత్తంగా రూ. 46,18,385 వస్తాయి. ఇలా ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ను బట్టి..ఆదాయం ఉంటుంది. అదే విధంగా ఎవరైనా లక్షకు బదులు, లక్షన్నర ఏడాదికి పెట్టుబడిగా పెడితే.. అమ్మాయి 21 ఏళ్లు వచ్చే సరికి మొత్తం 69 లక్షల 27 వేల 578 రూపాయలు వస్తాయి. అయితే ఈ స్కీమ్‌లో చేరాలని భావించే వారు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగించాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, పాప ఫోటోలు, పాప ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్ వంటి వాటిని సమర్పించి.. ఈ స్కీమ్ లో చేరవచ్చు. ఈ సుకన్య సమృద్ధి యోజన పథకంలో చేరాలని భావించే వారు దగ్గరిలోని బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు వెళ్లితే సరిపోతుంది.