విద్యార్థులకు సూపర్ ఛాన్స్… రూ.10,000 పొందే అవకాశం

www.mannamweb.com


కేంద్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసింది. వృద్ధులు, మహిళలు, విద్యార్థులు.. ఇలా అన్ని వర్గాల వారి కోసం చాలా స్కీమ్స్ ను ప్రారంభించారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే…వారికి ఆర్థికంగా చేయుత ఇచ్చే పథకాలు చాలానే అందుబాటులో ఉన్నాయి. ఇది ఇలా ఉంటే..విద్యార్థుల్లోనే ప్రతిభను వెలిగి తీసేందుకు ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి.తాజాగా విద్యార్థులకు బంపర్ ఆఫర్ వచ్చింది. రూ.10 వేల రూపాయలు పొందే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

విద్యార్థుల్లో సైన్స్ ప్రతిభను వెలికితీసి వారిని బాల శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ఇన్ స్పైర్-మనక్ పేరిట ప్రోగ్రామ్ ను ప్రారంభించిది. దీనిని కేంద్ర, శాస్త్ర సాంకేతిక మండలి, నేషనల్‌ ఇన్నోవేషన్‌ పౌండేషన్‌ సంయుక్తంగా నిర్విహిస్తుంది. ఏటా దేశంలో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి..ప్రతిభవంతులకు అవార్డులు అందిస్తున్నాయి. పాఠశాల విద్యార్థుల్లో వినూత్న ఆలోచనలను రేకెత్తించి.. వారిని రీసెర్చ్ వైపు మళ్లీంచేందుకు ఈ ఇన్‌స్పైర్‌ పోటీలకు నిర్వహిస్తున్నారు.

ఏటా మాదిరిగానే ఈ సారి కూడా ఈ ప్రోగ్రామ్ ను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇన్స్‌పైర్ అవార్డ్ ఐడియా/ఇన్నోవేషన్ దరఖాస్తులను ఓపెన్ చేసింది. స్కూల్ హెడ్ మాస్టర్, లేదా ప్రిన్సిపాల్ ఇన్ స్పైరింగ్ స్కూల్ అథారిటీగా నమోదు చేసుకోవచ్చు. ఇన్ స్పైర్ మనక్ అవార్డుల కోసం విద్యార్థులు వారి వారి ఆలోచనలను, ఇన్నోవేషన్స్‌ని సమర్పించవచ్చు. ఇందులో 5 భాగాలున్నాయి. అవి ఇన్‌స్పైర్ ఫెలోషిప్, ఇన్‌స్పైర్ ఇంటర్న్‌షిప్, ఇన్‌స్పైర్ అవార్డ్స్ మనక్, ఇన్‌స్పైర్ స్కాలర్‌షిప్, ఇన్‌స్పైర్ ఫ్యాకల్టీ. ఈ అవార్డు కోసం ఐడియాలు, ఇన్నోవేషన్స్‌ని నమోదు చేయడానికి 2024 సెప్టెంబర్ 15 చివరి తేది.

ఇక ఈ ప్రోగ్రామ్ కి అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాల్లో చదువుతున్న 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు అర్హులు. హై స్కూల్ స్థాయిలో చదువుతున్న విద్యార్థులను ఎంకరేజ్ చేసేందుకూ ఈ కార్యక్రమం నిర్వహించి.. ప్రతిభవంతులైన విద్యార్థులకు ఈ అవార్డ్ ఇస్తున్నారు. దీని ద్వారా విద్యార్థులు క్రియేటివ్‌గా ఆలోచిస్తారు. పరిశోధన, సాంకేతిక అంశాలపై ఫోకస్ పెడతారు. ఈ అవార్డు కింద విద్యార్థులకు కేంద్రం రూ.10,000 ఇస్తుంది. ఈ మనీ ఆ విద్యార్థులకు క్రియేటివ్ ఆలోచనలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. వారు మరింతగా కొత్త ఆవిష్కరణలు చెయ్యడానికి సాయపడుతుంది. మొత్తంగా విద్యార్థులు ఈ సూపర్ ఛాన్స్ ను వినియోగించుకుని 10 వేల రూపాయలను సొంతం చేసుకోవచ్చు. ఇలా విద్యార్థుల్లోనే ప్రతిభను వెలికి తీసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు ప్రోగ్రామ్స్ ను నిర్వహిస్తున్నాయి.