గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు. టైమ్ లాప్స్ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫచర్ సహాయంతో కాలంలో వెనక్కి వెళ్‌లొచ్చు. మీరు ప్రస్తుతం చూస్తున్న ప్రదేశం 20 ఏళ్ల క్రితం ఎలా ఉందో చూసుకునే వెసులుబాటు ఈ ఫీచర్‌తో కలిపించారు.
టైమ్ మెషిన్‌ను పోలిన ఈ ఫీచర్ సహాయంతో మీరు చూడాలనుకుంటున్న ప్రదేశాలు కొన్నేళ్ల క్రితం ఎలా ఉండేవో చూడొచ్చు. 1930 నుంచి నేటి వరకు బెర్లిన్, లండన్, పారిస్ వంటి నగరాల ప్రత్యేక ప్రదేశాలను చూడవచ్చని గూగుల్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది.
ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలనుకునే వారు గూగుల్ మ్యాప్స్ లేదా గూగుల్ ఎర్త్‌లోకి వెళ్లి మీరు చూడాలనంటుకున్న స్థలాన్ని సెర్చ్ చేయాలి. తర్వాత లేయర్స్ ఆప్షన్‌లోకి వెళ్లి టైమ్‌లాప్స్ ఆప్షన్‌ను ఆన్ చేయాలి. దీని తర్వాత మీరు సమయానికి తిరిగి వెళ్లి ఆ స్థలాన్ని చూడవచ్చు
ఇక గూగుల్ స్ట్రీట్ వ్యూ కోసం కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. స్ట్రీట్ వ్యూలో కార్లు మొదలు సుమారు 280 బిలియన్ల కంటే ఎక్కువ ఫొటోలు కనిపిస్తాయి. దీంతో రియల్‌టైమ్‌లో వీధులను వీక్షించవచ్చు.
అలాగే ఈ కొత్త ఫీచర్ సహాయంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోడ్లు, భవనాలను మీకు సమీపంలో ఉన్నట్లు అనిపించే విధంగా చూడవచ్చు. గూగుల్ దాదాపు 80 దేశాల్లో స్ట్రీట్ వ్యూ ఫీచర్‌ను విడుదల చేసింది.