కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ – వృద్ధులైన తల్లిదండ్రులను చూసుకోవడానికి 30 రోజుల సెలవులు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది తీపి కబరే. సర్వీస్ రూల్స్ ప్రకారం వృద్ధులైన తల్లిదండ్రులను చూసుకునేందుకు ఉద్యోగులకు 30 రోజుల సెలవులను అనుమతిస్తామని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ గురువారం రాజ్యసభలో తెలిపారు.


వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవడం సహా ఏదైనా వ్యక్తిగత కారణాలకు ఈ సెలవు పొందవచ్చన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవడానికి సెలవు తీసుకోవడానికి ఏదైనా నిబంధన ఉందా అన్న ప్రశ్నను ఓ ఎంపీ అడిగారు. ఆ ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు.

“సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (సెలవు) నియమాలు, 1972 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి ఇతర అర్హత గల సెలవులతో పాటు 30 రోజుల ఆర్జిత సెలవు, 20 రోజుల హాఫ్ జీతం సెలవు, ఎనిమిది రోజుల క్యాజువల్ సెలవు, సంవత్సరానికి రెండు రోజుల పరిమిత సెలవులను అందిస్తుంది, వీటిని వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవడం వంటి ఏవైనా వ్యక్తిగత కారణాల వల్ల పొందవచ్చు” అని సింగ్ లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (సెలవు) నియమాలు, 1972 ప్రకారం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక సంవత్సరంలో కింది సెలవులు అందుబాటులో ఉన్నాయి:

30 రోజుల ఆర్జిత సెలవు : ఈ సెలవు పూర్తి జీతంతో అందుబాటులో ఉంటుంది.
20 రోజుల హాఫ్ పే సెలవు : ఈ సెలవు తీసుకుంటే సగం జీతం వస్తుంది.
8 రోజుల క్యాజువల్ సెలవు : సాధారణ వ్యక్తిగత అవసరాల కోసం ఈ సెలవు తీసుకోవచ్చు.
2 రోజుల పరిమిత సెలవు : ఉద్యోగి ఎంచుకున్న పండుగలు లేదా ఇతర కారణాల కోసం ఈ సెలవు తీసుకోవచ్చు.

ఈ సెలవు నియమాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారి కుటుంబ బాధ్యతలను నిర్వహించడానికి సౌలభ్యం కల్పిస్తాయి. ముఖ్యంగా, వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ కోసం ఈ సెలవులను ఉపయోగించుకోవచ్చు. ఈ నియమాలు ఉద్యోగులకు వారి వ్యక్తిగత , కుటుంబ అవసరాలను నెరవేర్చేందుకు సహాయపడతాయని జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ సెలవులను తీసుకునేందుకు ఉద్యోగులు తమ సంబంధిత పై అధికారుల నుండి ముందస్తు ఆమోదం పొందాల్సి ఉంటుంది. జితేంద్ర సింగ్ సమాధానం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను చూపిస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.