చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు మార్కెట్లోకి నిత్యం కొత్త ఫోన్‌లను లాంచ్ చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఇన్‌ఫినిక్స్ అదిరిపోయే ఫోన్‌ను తీసుకొస్తోంది.
తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొచ్చే ఇన్‌ఫినిక్స్ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫోన్‌ను తీసుకొస్తోంది.
ఇన్‌ఫినిక్స్ హాట్ 50 ప్రో ప్లస్ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత సన్నని ఫోన్ ఇదేనని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ విడుదలకు సంబంధించి కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా ఈ ఫోన్ ఫీచర్లకు సంబంధించి కొన్ని వివరాలను కంపెనీ వెల్లడించింది. వీటి ప్రకారం ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇన్ఫినిక్స్ హాట్ 50 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జి 100 ప్రాసెసర్‌తో పనిచేస్తుందని పేర్కొంది. ఇక ఈ ఫోన్‌ను 16 జీబీ ర్యామ్ (8 జీబీ స్టాండర్డ్ + 8 జీబీ వర్చువల్)తో 256 జీబీ స్టోరేజ్‌ను అందించనున్నారు. ఇక స్క్రీన్ విషయానికొస్తే.. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఈ ఫోన్ కలిగి ఉంటుందని టీజర్ ద్వారా తెలుస్తోంది.
సెక్యూరిటీ పరంగా చూస్తే ఇందులో ఇన్ డిస్‌ప్లేలో ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అందించనున్నారు. ఈ డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో వస్తుందని తెలుస్తోంది. అయితే కంపెనీ ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఈ ఫోన్ ఫీచర్లకు సంబంధించి కంపెనీ ఫిలిప్పీన్స్‌లో టీజ్ చేసింది. ధరకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే త్వరలోనే భారత మార్కెట్లోకి ఈ ఫోన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.