మంచి మైలేజీ ఇచ్చే అడ్వెంచర్ బైక్ లలో హీరో ఎక్స్ పల్స్ 200 4వీ ఒకటి. దీని ప్రారంభ ధర రూ.1.47 లక్షలు, కాగా ప్రో వేరియంట్ కోసం రూ.1.54 లక్షలు ఖర్చుచేయాలి.
199.6సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ నుంచి 18.9 హెచ్ పీ, 17.35 టార్క్ విడుదలవుతుంది. ఐదు స్పీడ్ గేర్ బాక్స్, టెలిస్కోపిక్ ఫోర్కులు, మోనోషాక్ సెటప్, 276, 220 ఎంఎం డిస్కు బ్రేకులు, సింగిల్ చానల్ ఏబీఎస్ ఏర్పాటు చేశారు. దాదాపు 52 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది.
రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్ 450 బైక్ ధర రూ.2.85 లక్షల నుంచి రూ.2.98 లక్షల వరకూ పలుకుతోంది. దీనిలోని 452 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ నుంచి 39.47 హెచ్ పీ, 40 ఎన్ ఎం టార్కు ఉత్పత్తి అవుతుంది. ఆరు స్పీడ్ గేర్ బాక్స్, ముందు 41 ఎంఎం టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక మోనోషాక్ సెటప్, 320, 270 ఎంఎం డిస్కు బ్రేకులు, డ్యూయల్ చానల్ ఏబీఎస్ ఇతర ప్రత్యేకతలు. ఈ బండి సుమారు 32 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.
హోండా సీబీ 200ఎక్స్ బైక్ దాదాపు 40 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఐదు స్పీడ్ ట్రాన్స్ మిషన్, ముందు భాగంలో యూఎస్ డీ ఫోర్కులు, వెనుక మోనోషాక్ సెటప్, 276, 220 ఎంఎం డిస్క్ బ్రేకులు, సింగిల్ చానల్ ఏబీఎస్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. దీనిలోని 184.4 సీసీ సింగిల్ ఇంజిన్ నుంచి 17.03 హెచ్ పీ, 15.9 ఎన్ ఎం టార్కు విడుదలవుతుంది. ఈ బైక్ రూ.1.48 లక్షల ధరకు అందుబాటులో ఉంది.
సుజుకి వీ-స్ట్రోమ్ ఎస్ఎక్స్ బైక్ లో 249 సీసీ సింగిల్ సిలిండర్ ఏర్పాటు చేశారు. ఇది 26.11 హెచ్ పీ, 22.2 ఎన్ ఎం టార్కును ఉత్పత్తి చేస్తుంది. ముందు స్ప్రింగ్ లతో కూడిన టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక స్వింగ్ ఆర్మ్ టైప్ కాయిల్ స్ప్రింగ్ సెటప్ అమర్చారు. 300, 220 ఎంఎం డిస్కులు, డ్యూయల్ చానల్ ఏబీఎస్ ఇతర ప్రత్యేకతలు. 36 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే ఈ బైక్ ధర రూ.2.11 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.
యెజ్జీ అడ్వెంచర్ బైకు పేరుకు తగిన సామర్థ్యంతో పనిచేస్తుంది. దీని ధర రూ.2.09 లక్షల నుంచి రూ.2.19 లక్షల వరకూ ఉంది. దీనిలో 334 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. దాని నుంచి 29.89 హెచ్ పీ, 29.84 ఎన్ ఎం టార్క్ ఉత్పత్తి అవుతుంది. ఆరు స్పీడ్ టాన్స్ మిషన్, ముందు 41 ఎంఎం టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక సర్దుబాటు చేయగల మోనోషాక్ సెటప్, డ్యూయల్ చానల్ ఏబీఎస్ అదనపు ప్రత్యేకతలు. యెజ్డీ అడ్వెంచర్ బైక్ దాదాపు 34 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.