సుప్రీంకోర్టులో PA, కోర్టు మాస్టర్‌ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం.. మీరూ దరఖాస్తు చేయొచ్చు

www.mannamweb.com


న్యూఢిల్లీలో ఉన్న భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో పలు ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదలైంది.

ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 107 కోర్టు మాస్టర్‌ (షార్ట్‌హ్యండ్‌) (గ్రూప్‌-ఏ గేజిటెడ్‌), సీనియర్‌ పర్సనల్‌ అసిస్టెంట్‌ (గ్రూప్‌-బి), పర్సనల్‌ అసిస్టెంట్‌ (గ్రూప్‌-బి) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ అర్హత కలిగిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్‌ 25, 2024వ తేదీని ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీగా నిర్ణయించారు. టైపింగ్‌ టెస్ట్‌, రాత పరీక్ష, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఖాళీల వివరాలు ఇలా..

కోర్టు మాస్టర్‌ (షార్ట్‌హ్యండ్‌) (గ్రూప్‌-ఏ గేజిటెడ్‌) పోస్టుల సంఖ్య: 31
సీనియర్‌ పర్సనల్‌ అసిస్టెంట్‌ (గ్రూప్‌-బి) పోస్టుల సంఖ్య: 33
పర్సనల్‌ అసిస్టెంట్‌ (గ్రూప్‌-బి) పోస్టుల సంఖ్య: 43
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి ఏయే అర్హతలుండాలంటే.. కోర్టు మాస్టర్‌ పోస్టులకైతే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లా డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే డిగ్రీతోపాటు 120 డబ్ల్యూపీఎంతో ఇంగ్లిష్‌ షార్ట్‌ హ్యండ్‌ స్పీడ్‌, 40 డబ్ల్యూపీఎం కంప్యూటర్ టైపింగ్ స్పీడ్‌ కలిగి ఉండాలి. సీనియర్‌ పర్సనల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఏదైనా డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణతతోపాటు 110 డబ్ల్యూపీఎం షార్ట్‌హ్యండ్‌ ఇంగ్లిష్‌, 40 డబ్ల్యూపీఎం కంప్యూటర్‌ టైపింగ్‌ స్పీడ్‌లో అర్హత ఉండాలి. ఇక పర్సనల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణతతోపాటు 100 డబ్ల్యూపీఎం షార్ట్‌హ్యండ్‌ ఇంగ్లిష్‌, స్పీడ్‌ 40 డబ్ల్యూపీఎం కంప్యూటర్‌ టైపింగ్‌ స్పీడ్‌తో సర్టిఫికెట్‌ ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి కోర్టు మాస్టర్ పోస్టుకు 30 నుంచి 45 ఏళ్లు, సీనియర్‌ పర్సనల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లు, పర్సనల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఎవరైనా డిసెంబర్‌ 25, 2024వ తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌/ పీహెచ్‌ అభ్యర్థులు రూ.250 చెల్లించవల్సి ఉంటుంది.

టైపింగ్‌ టెస్ట్‌, రాత పరీక్ష, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు కోర్ట్‌ మాస్టర్ పోస్టుకు రూ.67,700, సీనియర్‌ పర్సనల్‌ అసిస్టెంట్‌కు రూ.47,600, పర్సనల్‌ అసిస్టెంట్‌కు 44,900 చొప్పున జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.