Suresh Gopi: కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రాజీనామా

Suresh Gopi: ప్రముఖ మలయాళ నటుడు సురేష్ గోపీ లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. త్రిశ్శూర్ జిల్లాలో ఎంపీగా పోటీ చేసిన సురేష్ గోపీకి ప్రధాని నరేంద్ర మోదీ క్యాబినెట్‌లో అవకాశం కల్పించారు.


నిన్న సురేష్ గోపీ ప్రమాణ స్వీకారం కూడా చేసారు. అయితే.. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తనకు ఆ పదవి వద్దు అని రాజీనామా చేసేయడం చర్చనీయాంశంగా మారింది.

తనకు త్రిశ్శూర్ ఎంపీగానే ప్రజలకు సేవ చేయాలని ఉందని కేంద్ర మంత్రి వర్గంలో ఎలాంటి పదవి అవసరం లేదని చెప్పారు. పైగా ఆయన పలు సినిమాలకు ఒప్పుకున్నానని.. వాటిని ఎలాగైనా పూర్తి చేసి తీరాలని కూడా పార్టీ హైకమాండ్‌కు తెలియజేసారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.