Gayatri Bhargavi | బ్రతికున్న భర్తను థంబ్‌నెయిల్‌తో చంపేశారు

టాలీవుడ్ నటి భార్గవి ఐడ్రీమ్ (idream media) అనే యూట్యూబ్ ఛానల్‌పై తీవ్ర విమర్శలు గుప్పించింది. తప్పుడు థంబ్‌నెయిల్స్ పెట్టి బ్రతికున్న నా భర్తను చనిపోయినట్లు చిత్రీకరించడమే కాకుండా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నట్లు ఐడ్రీమ్‌తో పాటు ఇతర యూట్యూబ్ ఛానల్స్‌పై ఆగ్రహాం వ్యక్తం చేసింది.


ఈ సందర్భంగా ఒక వీడియోను విడుదల చేసింది.

ఇటీవలే నేను ఐడ్రీమ్ అనే యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాను. యాంకర్ స్వప్న పిలిచిందని వెళ్లాను. ఈ ఇంటర్వ్యూ కూడా బాగా జరిగింది. అయితే ఈ ఇంటర్వ్యూలో మా ఆయన ఆర్మీ ఆఫీసర్, బోర్డర్‌లో అతడి జీవితం ఎలా ఉంటుంది అనే దానిపై కూడా స్పందించాను. అయితే నేను మాట్లాడిన మాటలన్ని తీసుకుని ఒక తప్పుడు థంబ్‌నెయిల్స్‌ను ఐడ్రీమ్ క్రియేట్ చేసి యూట్యూబ్‌లో వదిలింది. ఈ థంబ్‌నెయిల్‌లో నా భర్త చనిపోయినట్లు అర్థం వచ్చేలా రాయడమే కాకుండా నా ఫ్యామిలీ ఫొటోలను పెట్టారు. ఐడ్రీమ్‌తో పాటు మిగతా యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూ పేరుతో ప్రజలను తప్పుదారి పట్టించడమే కాకుండా ఒక ఆర్మీ అధికారితో పాటు అతడి భార్య గురించి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. నేను ఒక్కటే అడగాలి అనుకుంటున్నాను. ఎందుకు ఇలా చేస్తున్నారు. ఇదే విషయం గురించి యాంకర్ స్వప్నని సంప్రదించగా.. రెండు సార్లు డీలిట్ చేసి మళ్లీ అప్‌లోడ్ చేశారు. ఈ విషయంలో నాకు ఐడ్రీమ్ నుంచి సమాధానమే కాకుండా క్షమాపణలు కూడా చెప్పాలంటూ భార్గవి చెప్పుకోచ్చింది. కాగా ఇందుకు సంబంధించిన ప్రస్తుతం వైరల్‌గా మారింది.