స్వరూపానంద కూడా ప్లేట్ తిప్పేశారు !

జగన్ రెడ్డి ముఫ్పై ఏళ్లు సీఎంగా ఉంటారని.. ముద్దులు పెట్టుకుని మరీ ప్రకటించిన స్వరూపానంద ఎన్నికలకు ముందు జగన్ మరోసారి గెలవాలని యాగాలు కూడా చేశారు.


రాజకీయ వ్యాఖ్యలు కూడా చేస్తూ చంద్రబాబు, టీడీపీపై అనుచితంగా మాట్లాడి చాలా సార్లు వివాదాస్పదమయ్యారు. దానికి తగ్గ ప్రతిఫలాన్ని ప్రభుత్వం నుంచి పొందారు. శారదాపీఠం పెద్ద ఎత్తున భూముల్ని పొందింది. ఇప్పుడు వైసీపీ తుడిచి పెట్టుకుపోయే సరికి ఆయన మాట మార్చేశారు.

రాజకీయాల్లో ఇప్పుడు పెద్ద దిక్కు చంద్రబాబు అని చెప్పుకొచ్చరాు. బాబు హయాంలో ఏపీ అభివృద్ధి జరగుతుందని. చెప్పుకొచ్చారు. చంద్రబాబు శ్రీ మహా లగ్నంలో 11.25 గంటలకు సీఎం గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.. ఇది శుభ లగ్నమన్నారు. క్లిష్ట పరిస్థతుల్లో వున్న ఏపీని చంద్రబాబు ఆడుకుంటారనిని ఆశిస్తున్నాను .. ఎపి రాజధానిగా తీర్చిదిద్దే అమరావతిలో మా పీఠానికి స్థలం వుంది.అక్కడ పీఠాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.

ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అమ్మవారి అశీస్సులు వుండాలని ఆశిస్తున్నాని చంద్రబాబు..పవన్ కళ్యాణ్ హయాంలో దేవాదాయ శాఖ అభివ్రుద్ది చెంతుతుందన్నారు. తాను టీడీపీకి, చంద్రబాబుకు వ్యతిరేకం కాదని గతంలో చంద్రబాబు హయాంలో మురళీ మోహన్ గెలవాలని రాజమండ్రిలో భారీ ఆధ్యాత్మిక కార్యక్రమం పెట్టానన్నారు. శారదా పీఠం ప్రభుత్వాల పై బతకదని ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటుందని చెప్పుకొచ్చారు.

చంద్రబాబు ను కొత్తగా పొగుడుతూ ఉన్నానని అనుకోవద్దని.. ఎవరికీ భయపడి ఈ ప్రెస్ మీట్ పెట్టడం లేదన్నారు. తమపై తప్పుడు అభిప్రాయాలు రాకుండా ప్రెస్ మీట్ పెట్టానన్నారు. స్వరూపానంద ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వంతో అంటకాగుతారు.. అయితే వైసీపీకి .. ఆ పార్టీ అధినేతకు .. తానే రాజగురువు అన్నట్లుగా వ్యవహరించి ఇప్పుడు బోల్తా పడ్డారు. కొత్త ప్రభుత్వం ..తమ భూముల్ని స్వాధీనం చేసుకోకుండా కొత్త నాటకం ప్రారంభించారు.