రూ. 3 లక్షలు ఒకేసారి పెట్టుబడి పెడితే చాలు.. 30ఏళ్లు నెలకు రూ. 52వేలకు పైగా డబ్బులు సంపాదించవచ్చు.

పెట్టుబడి పెట్టేందకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ముందే మీ రిటైర్మెంట్ ప్లాన్ రెడీ చేసుకోండి. మీరు రిటైర్మెంట్ అయ్యే సమయానికి డబ్బుల పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ముందు నుంచే డబ్బులను సేవింగ్స్ చేసుకోవాలి.


అప్పుడు మాత్రమే వృథ్యాప్య పరిస్థితుల్లో ఒకరిపై ఆధారపడకుండా జీవించవచ్చు.

సాధారణంగా ఎక్కువకాలం పెట్టే పెట్టుబడులతోనే అధిక లాభాలను పొందవచ్చు. చాలామంది పెట్టుబడిదారులు తక్కువ సమయంలో ఎక్కువగా కూడబెట్టాలంటే అన్నిసార్లు సాధ్యపడదని గుర్తించాలి. దీర్ఘకాలిక పెట్టుబడులతోనే ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు.

మీరు పెట్టే పెట్టుబడి చిన్నదైనా దీర్ఘకాలం కొనసాగించడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టిన తర్వాత భవిష్యత్తులో మీ ఆర్థికపరమైన అవసరాలకు సాయపడుతుంది. దీర్ఘకాలికంగా రాబడిని కోరుకునేవారికి ఇది చాలా అవసరం కూడా. పెట్టుబడుల నుంచి గణనీయమైన రాబడిని కోరుకునే ఎవరైనా తమ పెట్టుబడులను దీర్ఘకాలికంగా కొనసాగించాలి.

అప్పటివరకూ ఓపిక కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే భవిష్యత్తులో అనుకున్న ఆర్థిక లక్ష్యాలను చేరుకోవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడిదారుడికి మ్యూచువల్ ఫండ్‌లో సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (SWP) అద్భుతమైన రాబడిని అందిస్తుంది. ఈ పథకం ఒకేసారి రూ. 3 లక్షలు పెట్టుబడి పెడితే 30 ఏళ్ల పాటు రూ. 52వేలకు పైగా ఎక్కువ నెలవారీ ఆదాయాన్ని సంపాదించవచ్చు.

ఒకేసారి పెట్టుబడితో అధిక రాబడి ఎలా? :
మ్యూచువల్ ఫండ్స్ వంటి మార్కెట్-లింక్డ్ ఇన్వెస్ట్‌మెంట్ టూల్స్‌లో ఒకేసారి పెట్టుబడి పెట్టవచ్చు. అందులోనూ మీరు మీ డబ్బులను పెట్టుబడి పెట్టేందుకు సరైన సమయాన్ని అంచనా వేయడం చాలా కష్టం. మార్కెట్ టైమింగ్ అంచనా చేయలేం కూడా. దీర్ఘకాలిక పెట్టుబడిపై ఆసక్తి ఉన్నవారికి ఒకేసారి పెట్టుబడి పెట్టడం ద్వారా ఆకర్షణీయమైన రాబడిని పొందవచ్చు.

ఎందుకంటే.. స్వల్పకాలంలో, మార్కెట్ వివిధ హెచ్చు తగ్గులకు లోనువుతుంది. మార్కెట్ బాగా పడిపోతే పెట్టుబడి నెగటివ్‌గా మారవచ్చు. అయితే, మార్కెట్ దీర్ఘకాలిక రాబడిని మనం ఒకసారి పరిశీలిస్తే.. ఎక్కువగా పెట్టుబడిదారులకు మరింత రాబడి ప్రయోజనాలను అందిస్తుంది.

మ్యూచువల్ ఫండ్‌లో SWP ఏంటి? :
సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (SWP) అనేది మ్యూచువల్ ఫండ్‌లో ఒక క్రమపద్ధతిలో స్థిర మొత్తాన్ని ఆదాయంగా పొందవచ్చు. పెట్టుబడిదారుడు మ్యూచువల్ ఫండ్‌లో కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టి ప్రతి నెలా ఒక స్థిర మొత్తాన్ని తమ అకౌంటులో క్రెడిట్ చేయమని ఫండ్ హౌస్‌కు సూచించవచ్చు. ఫండ్ హౌస్ అదే విలువ కలిగిన ఫండ్ యూనిట్లను విక్రయించి, ఆ మొత్తాన్ని పెట్టుబడిదారుడి అకౌంట్లలో జమ చేస్తుంది.

నెలకు రూ.52వేలకు పైగా రాబడి :
ముందుగా సింగిల్ టైమ్ పెట్టుబడిగా రూ. 3 లక్షలు పెట్టాలి. ఆ మొత్తాన్ని 30 ఏళ్ల పాటు అలానే ఉంచాలి. ఆ తర్వాత రాబోయే 30 ఏళ్లకు అందులో కొంత మొత్తాన్ని రాబడిగా పొందవచ్చు. ఉదాహరణకు.. ఒక వ్యక్తికి 25 ఏళ్ల వయస్సు ఉంటే.. 55 ఏళ్లు వచ్చే వరకు కార్పస్ పెరగనివ్వవచ్చు.

85 ఏళ్ల వయస్సు వరకు నెలవారీ ఆదాయాన్ని పొందవచ్చు. ఒకేసారి పెట్టుబడి పెట్టేవారికి వార్షికంగా 12 శాతం రాబడి పొందవచ్చు. అయితే, SWP పెట్టుబడితో మాత్రం 7 శాతంగా వార్షిక రాబడిని పొందవచ్చు. 30 ఏళ్లలో ఒకేసారి పెట్టుబడితో అంచనా వేసిన మూలధన లాభాలు రూ. 86,87,977 అవుతాయి. అయితే, అంచనా వేసిన కార్పస్ రూ. 89,87,977 అవుతుంది.

దీర్ఘకాలిక మూలధన లాభం (LTCG)గా చూస్తారు. అందుకే దీనిపై రూ. 1,25,000 పన్ను మినహాయింపు ఉంటుంది. ఆ తర్వాత, వడ్డీ రేటు 12.5 శాతం. అంచనా వేసిన పన్ను రూ. 10,70,372.125, పన్ను అనంతర వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభం రూ. 79,17,604.875. ఇదే SWP మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి మొత్తం అవుతుంది. అలాగే, 30 ఏళ్లకు నెలవారీ ఆదాయం 7 శాతం వార్షిక రాబడితో పెట్టుబడిదారుడు 30 ఏళ్ల పాటు నెలవారీగా రూ. 52,370 మొత్తాన్ని రాబడిగా తిరిగి పొందవచ్చు.