ఏఐనే చాలా గొప్ప అనుకుంటుంటే.. ఇప్పుడు దాన్ని మించింది రాబోతోంది. ఎస్ ఐ అంట! అదే సింథటిక్ టెక్నాలజీ.. ఇది ఏఐ లాంటిది కాదు. అంతకుమించి ఉంటుంది. అచ్చం మనుషుల్లా క్రియేటివ్ గా ఆలోచించగలిగే ఈ టెక్నాలజీ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం.
సింథటిక్ ఇంటెలిజెన్స్ అనేది ఏఐని తలదన్నే మోడల్. ఒక్క ముక్కలో చెప్పాలంటే దీన్ని మనిషికి డూప్లికేట్ అనుకోవచ్చు. కాదు కాదు, ఇది ఏకంగా మనిషికి పోటీ అనే చెప్పొచ్చు.
స్వయంగా నిర్ణయాలు తీసుకునేలా ప్రోగ్రామింగ్ చేసే ప్రక్రియని సింథటిక్ ఇంటెలిజెన్స్ అంటారు. ఎస్ ఐ అనేది ఏఐ లాగా డేటా ప్రాసెసింగ్ లేదా ప్రోగ్రామింగ్ చేసే ఇంజిన్ కాదు, దీనికి మనిషికి ఉండే అవగాహన, సృజనాత్మకత ఉంటాయి. ఒక్కముక్కలో చెప్పాలంటే ఇది ఇది లోడ్ చేసిన ఇన్ఫర్మేషన్ పై పనిచేయదు, పరిస్థితులను అర్థం చేసుకుని నిర్ణయాలు తీసుకోగలదు. అందుకే దీని ముందు ఏఐ దిగదుడుపే అంటున్నారు టెక్ నిపుణులు.
ఏఐ vs ఎస్ ఐ
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కు ముందుగానే ఇన్ఫర్మేషన్ లోడ్ చేస్తారు. అడిగిన ప్రశ్నను బట్టి అది ఎనలైజ్ చేసి రిజల్ట్స్ ఇస్తుంది. ఏఐకు సొంతంగా నేర్చుకునే సామర్థ్యం ఉండదు. అయితే ఎస్ ఐ అలా కాదు. దీనికి సెల్ఫ్ లెర్నింగ్ కేపబిలిటీస్ ఆటోమేటిక్ గా ఉంటాయి. ఇది మనిషి మాట్లాడే మాటలు, టోన్ లేదా టైప్ చేసే పదాలు, వాటి అమరికను బట్టి అతని మూడ్, ఉద్దేశాన్ని కూడా పసిగట్టగలదు. మనుషుల లాగా తనకు తానే సొంతంగా ఆలోచించగల వ్యవస్థను నిర్మించడం సింథటిక్ ఇంటెలిజెన్స్ లక్ష్యం.
యాక్టింగ్ vs థింకింగ్
మరో విధంగా చెప్పాలంటే.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మనిషి మేథస్సు మీద ఆధారపడి పనిచేసే టెక్నాలజీ అయితే.. సింథటిక్ ఇంటెలిజెన్స్ మనిషి మేధస్సు మీద ఆధారపడని టెక్నాలజీ. ఏఐ అనేది నటించే మెషిన్ అయితే.. ఎస్ ఐ ఆలోచించే మెషిన్. అంటే మనం సినిమాల్లో చూసే రోబో లాంటిదన్న మాట. అయితే ఈ టెక్నాలజీ విషయంలో కొన్ని ప్రమాదాలూ లేకపోలేదు. అందుకే దీన్ని మరింత జాగ్రత్తగా ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. ఈ సింథటిక్ ఇంటెలిజెన్స్ ను మరింత అభివృద్ధి చేస్తే పలు రంగాల్లో మానవుల కంటే ముందు ఉంటుందని టెక్ ఎక్స్ పర్ట్స్ అంచనా వేస్తున్నారు.
































