టీ20 ప్రపంచ కప్‌లో టాప్-8 టీమ్‌లు ఏవో తేలిపోయాయి. సూపర్-8 పోరులో తలపడేందుకు సిద్ధమవుతున్నాయి.
టీ20 ప్రపంచ కప్ గ్రూప్ స్టేజ్‌లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన పాకిస్థాన్ లీగ్ స్టేజ్‌లోనే ఇంటిముఖం పట్టింది. ఇక కీలకమైన రెండో దశకు తెరలేవనుంది. ఇవాళ్టితో లీగ్ స్టేజ్ ముగిసి.. బుధవారం నుంచి సూపర్-8 పోరు ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆ ఎనిమిది జట్లేవో తెలిసిపోయింది. ఇవి కూడా రెండు గ్రూప్‌లుగా విడిపోయి తలపడతాయి. మరి ఆ గ్రూప్‌లు ఏంటి? మ్యాచ్‌లు ఎప్పుడు మొదలవుతాయో చూద్దాం..
ఏ గ్రూప్‌లో ఎవరంటే?
ఐసీసీ ర్యాంకుల ప్రకారం జట్లకు సీడింగ్‌ల కేటాయింపు జరిగింది. గ్రూప్-A నుంచి భారత్, యూఎస్‌ఏ అర్హత సాధించాయి. గ్రూప్-B నుంచి ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా.. గ్రూప్-C నుంచి అఫ్గానిస్థాన్, వెస్టిండీస్.. గ్రూప్-D నుంచి దక్షిణాఫ్రికా బంగ్లాదేశ్ అర్హత దక్కించుకున్నాయి.
లీగ్ స్టేజ్లో A1, B2, C1, D2గా ఉన్న టీమ్‌లు సూపర్-8లో గ్రూప్-1గా ఉంటాయి. ఇందులో భారత్, ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ చోటు సంపాదించాయి. ఇక గ్రూప్-2లో A2, B1, C2, D1 అయిన యూఎస్‌ఏ, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ తలపడతాయి. ఇందులో ఒక్కో జట్టు ప్రత్యర్థితో ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఆయా గ్రూపుల్లో మొదటి, రెండు స్థానాల్లో నిలిచిన టీమ్‌లు సెమీస్‌కు చేరతాయి.
భారత్ మ్యాచ్‌లు ఇవే..
బార్బడోస్ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జూన్ 20న మ్యాచ్
ఆంటిగ్వా వేదికగా బంగ్లాదేశ్‌తో జూన్ 22న పోరు
సెయింట్ లూసియా వేదికగా ఆస్ట్రేలియాతో జూన్ 24న మ్యాచ్
టీమ్‌ఇండియా మ్యాచులన్నీ మన కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం
ఇతర జట్ల మ్యాచ్‌లు ఇలా..
జూన్ 19: యూఎస్‌ఏ-దక్షిణాఫ్రికా
జూన్ 19: ఇంగ్లాండ్-వెస్టిండీస్
జూన్ 20: ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్
జూన్ 21: ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా
జూన్ 21: యూఎస్ఏ-వెస్టిండీస్
జూన్ 22: అఫ్గానిస్థాన్ – ఆస్ట్రేలియా
జూన్ 23: యూఎస్‌ఏ-ఇంగ్లాండ్
జూన్ 23: వెస్టిండీస్-దక్షిణాఫ్రికా
జూన్ 24: అఫ్గానిస్థాన్-బంగ్లాదేశ్