Tandel.. ఒక్క సీన్ కోసం రూ.18 కోట్లు ఖర్చుపెట్టిన డైరెక్టర్.

అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన తాజా మూవీ తండేల్‌. శ్రీకాకుళం జిల్లా డి. మత్స్యలేశం గ్రామంలో చోటు చేసుకున్న యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కనుంది.


వేటకు వెళ్ళిన పలువురు మత్స్యకారులు పాకిస్తాన్ కోస్ట్ గార్డుకు చిక్కి.. రెండేళ్లు జైలు శిక్ష అనుభవించిన వృత్తాంతాన్ని తెరపై చూపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా గడుపుతున్నారు మేకర్స్‌. ఫిబ్రవరి 7న రిలీజ్ కానున్న ఈ సినిమాకు కొద్దిరోజులుగా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే.

కార్తికేయ 2 ఫేమ్ చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే.. తాజాగా చందు మొండేటి సినిమాపై ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించాడు. కార్తికేయ 2 సినిమాకు పని చేసినా అనుభవం ఈ సినిమాకు ఎంతగానో ఉపయోగపడిందంటూ చెప్పిన చందు.. తాను అనుకున్న బడ్జెట్ను ఎప్పుడు దాటి సినిమా చేయనని వెల్లడించాడు. తండేల్ రీసెర్చ్ తర్వాతే కథ రాయడం మొదలు పెట్టానని.. హీరో బాడీ లాంగ్వేజ్.. వెళ్లి ఇంకా అప్పుడు ఏం జరిగింది.. ఎలాంటి పరిస్థితులు వచ్చాయి అనే వివరాలు అక్కడ వారిని అడిగి తెలుసుకున్నానంటూ చెప్పుకొచ్చాడు చందు.

అంతేకాదు ఈ సినిమాలోని ఒక ఎపిసోడ్ కోసమే ఏకంగా రూ.18 కోట్లు ఖర్చయిందని షాకింగ్ విషయాల్ని చెప్పుకొచ్చాడు. సముద్రాన్ని లైవ్ లొకేషన్‌గా మార్చి మినియేచర్ పడవలతో సినిమా కోసం వర్క్ చేసామని.. సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయంటూ వెల్లడించాడు. కొన్ని సందర్భాల్లో సముద్రం మధ్యలో జరిగే సీన్స్ చూస్తే గూస్‌బంప్స్ రావడం ఖాయం అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. ప్రస్తుతం చందు మొండేటి కమెంట్స్ వైరల్ అవడంతో.. సినిమాపై మరింత హైప్ నెలకొంది. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య, సాయి పల్లవి గతంలోనే లవ్ స్టోరీ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ క్రమంలోనే వీరి కాంబోలో అదే మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవ్వడం ఖాయం అంటూ ఫ్యాన్స్ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.