తండేల్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..?..ఇంత త్వరగానా.

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య, డ్యాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి లీడ్ రోల్​లో తెరకెక్కిన చిత్రం తండేల్. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ చందూ మెండేటి తెరకెక్కించిన ఈ మూవీ ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. రూ. 100కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. చైతా కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మంచి లవ్ అండ్ ఎమోషన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన ఈ సినిమా ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అయింది. ముఖ్యంగా ఈ సినిమాలో లవ్ ట్రాక్ సాంగ్స్ ఆకట్టుకున్నాయి. చైతూ, సాయి పల్లవి నటన అందరినీ ఆకట్టుకుంది.


అయితే తండేల్ మూవీ ఓటిటి రిలీజ్ డేట్ పై సోషల్ మీడియాలో పెద్ద ప్రచారమే నడుస్తోంది. ఈ సినిమా ఓటిటి రైట్స్ ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఇందుకోసం దాదాపుగా రూ.30 కోట్లు పైగా మేకర్స్ కి చెల్లించినట్లు సమాచారం. అయితే తండేల్ మూవీ మార్చి7న ఓటిటిలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక తండేల్ మూవీ.. శ్రీకాకుళం జిల్లా డి మత్స్యలేశం గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందింది. వేటకు వెళ్లిన పలువురు మత్స్యకారులు గుజరాత్​పోర్ట్​కి వెళ్లిన సమయంలో అనుకోకుండా పాకిస్థాన్ సీ వాటర్స్ వెళ్లి అరెస్ట్​అవుతారు. అయితే వారు ఆ చెర నుంచి ఎలా బయటపడ్డారనేదే ఈ కథ. స్టోరీని మరింతగా కనెక్ట్ చేసేందుకు రాజు-సత్య అనే ఫిక్షనల్ లవ్ స్టోరీని జోడించారు మేకర్స్​.