ఈ రక్షా బంధన్.. టాటా మోటార్స్ తయారీదారులు, రవాణాదారుల మధ్య అందమైన సంబంధానికి చిహ్నంగా నిలుస్తుంది. జంషెడ్‌పూర్ ప్లాంట్ దుర్గా లైన్‌లోని మహిళలు ట్రక్ డ్రైవర్ల కోసం స్వయంగా తయారు చేసిన రాఖీలు ప్రేమ, ఆప్యాయతకు చిహ్నంగా నిలుస్తున్నాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తూ నిత్యం డ్రైవింగ్‌లో బిజీగా ఉండే డ్రైవరకు ఇది ఒక మధురమైన జ్ఞాపకంగా నిలుస్తుంది.
ట్రక్ డ్రైవర్ల జీవితమంటేనే..అవిశ్రాంత పని.. అనుక్షణం అప్రమత్తతో ఉండాలి. ఎంతో మంది డ్రైవర్లు నిద్రలేని రాత్రులు గడుపుతుంటారు. ఈ రక్షాబంధన్ సందర్భంగా టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్.. టీవీ9 నెట్‌వర్క్ భాగస్వామ్యంతో.. సాటిలేని డ్రైవర్ల స్ఫూర్తికి సెల్యూట్ చేస్తుంది. “రక్షా కా బంధన్ – టాటా ట్రక్కులు, దేశ్ కే ట్రక్కులు’’.. అనే నినాదాన్ని బలపరుస్తుంది. టాటా జంషెడ్‌పూర్ ప్లాంట్ దుర్గా లైన్‌లోని మహిళలు చేతితో అద్భుతమైన రాఖీలను తయారు చేశారు. ఇవి సాధారణ రాఖీలు కాదు. ట్రక్ సారథుల కోసం వారి మంచి మనస్సు, ఆశీస్సులతో చేసిన రాఖీలు. అంతేకాకుండా ట్రక్ డ్రైవర్లకు రక్షణ, గౌరవానికి సంబంధించి ప్రేమపూర్వక లేఖలు రాశారు. రాఖీలతో పాటు ఈ సందేశాలను పంపించారు.
మహిళల ఈ చొరవ ట్రక్ డ్రైవర్ల సంతోషానికి కారణమైందని చెప్పొచ్చు. ఈ రాఖీలతో రక్షణ అంటే క్రాష్-టెస్ట్ చేయబడిన సేఫ్ అల్ట్రా, సిగ్నా , ప్రైమా టాటా ట్రక్కులు, ఇంజిన్ బ్రేక్‌లు, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి యాక్టివ్ సేఫ్టీ ఫీచర్లు లేదా ఈ టాటా ట్రక్కులలో డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్, ADAS ఎంపికలు మాత్రమే కాదనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కొన్ని సార్లు చిన్న పనులు కూడా గొప్ప సంతోషాలకు కారణమవుతాయి. నిశబ్ద బంధాలు, దేశాన్ని కదిలించే ట్రక్కులను నిర్మించడంలో సదరు మహిళలు భాగమవడం గర్వంగా ఉందని కంపెనీ తెలిపింది. ఈ రక్షా బంధన్.. టాటా మోటార్స్ తయారీదారులు, రవాణాదారుల మధ్య అందమైన సంబంధానికి చిహ్నంగా నిలుస్తుంది.































