ఎన్‌డీఏలోకి టీడీపీ?: సీట్ల సర్ధుబాటుపై చర్చలు

ఢిల్లీ: పొత్తు విషయంలో భారతీయ జనతా పార్టీ అగ్రనేతలతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ లు గురువారం నాడు అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు.
శుక్రవారం నాడు కూడ ఈ చర్చలు జరిగే అవకాశం ఉంది.ఇవాళ మధ్యాహ్నానికి పొత్తు విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
గత నెలలో కూడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ. నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. బీజేపీ నేతలతో చర్చలు జరిపేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు గురువారం నాడు సాయంత్రం న్యూఢిల్లీకి చేరుకున్నారు. గురువారం నాడు అర్ధరాత్రి వరకు కేంద్ర హోంశాఖ మంత్రితో చర్చించారు. ఎన్‌డీఏ కూటమిలోకి టీడీపీ చేరే విషయమై చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దరిమిలా అసెంబ్లీతో పాటు పార్లమెంట్ లో గతంలో కంటే ఎక్కువ సీట్లను బీజేపీ కోరే అవకాశం లేకపోలేదు.
2014 ఎన్నికల్లో బీజేపీకి 4 ఎంపీ, 13 అసెంబ్లీ స్థానాలను తెలుగుదేశం పార్టీ కేటాయించింది. అయితే ఈ దఫా బీజేపీ ఆరు ఎంపీ, 10 అసెంబ్లీ స్థానాలను కోరుతున్నట్టుగా ప్రచారం సాగుతుంది. ఇప్పటికే జనసేనతో పొత్తు నేపథ్యంలో ఆ పార్టీకి తెలుగుదేశం పార్టీ 24 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలను కేటాయించింది. దరిమిలా బీజేపీ కోరిన సీట్లను తెలుగుదేశం పార్టీ కేటాయిస్తుందా లేదా అనేది ప్రస్తుతం చర్చ సాగుతుంది.ఇవాళ కూడ బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల చర్చలు కొనసాగే అవకాశం ఉంది. ఇవాళ మధ్యాహ్ననికి పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం లేకపోలేదు.