Tea Recipe : టీని ఎంతసేపు మరిగిస్తే బాగుంటుంది? ఎక్కువసేపు అయితే హానికరమా?

చాలా మందికి ఇష్టమైన పానీయం టీ. చాలా మంది టీతో తమ రోజును ప్రారంభిస్తారు. టీ తాగకపోతే ఆ రోజు వాళ్లకు ఏదీ తోచదు. టీ అంటే చాలా మందికి ఇష్టం. రోజులో చాలా సార్లు టీ తాగుతారు.
కేవలం ఒక గ్లాసు టీ తాగితే తలనొప్పి పోతుందని నమ్ముతారు. తలనొప్పి వచ్చినప్పుడల్లా టీ తాగుతుంటారు. చాలా మంది టీని ఉత్తేజపరిచే, రిఫ్రెష్‌గా భావిస్తారు. టీ అంటే పిచ్చి ఉన్నవాళ్లు సమయానికి టీ తాగకపోతే నెర్వస్ గా ఫీల్ అవుతారు. అతిగా టీ తాగడం వల్ల దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. టీ తాగే అలవాటును మానుకోవడం అంత సులభం కాదు. అయితే ఇంట్లో టీ చేసేప్పుడు కొన్ని చిట్కాలు పాటించాలి. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది.


టీ ప్రేమికులు చాలా రకాలుగా ఉంటారు. కొందరు అలసిపోయినప్పుడే టీ తాగుతారు. కొందరు మాత్రం స్ట్రాంగ్ టీ తాగుతారు. కొందరు టీని ఎక్కువ సేపు మరిగించి తాగుతుంటారు. కానీ టీని ఎక్కువ సేపు మరిగించడం చేస్తే శరీరానికి హాని కలుగుతుంది. అందుకే టేస్టీ టీ ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.
ముందుగా పాలను మరిగించాలి. ఆ తర్వాత అందులో చక్కెర వేసుకోవాలి. గ్యాస్ మీద నుంచి కిందకు దించడానికి రెండు నిమిషాల ముందు టీ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. చాలా మంది పాలు పొయ్యి మీద పెట్టగానే టీ పౌడర్ వేస్తారు. కానీ ఇలా చేస్తే టీ రుచిగా ఉండదు. ఎక్కువసేపు మరిగించడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు.

బ్లాక్ టీ చేసే సమయంలోనూ ఇలానే చేయాలి. ముందుగా టీ పొడిని నీళ్లలో వేసి మరిగించాలి. టీ పౌడర్ నీటిలో పడితే, అది రంగు మారుతుంది. నీటి రంగు మారిన రెండు నిమిషాలు మాత్రమే మరిగించాలి. ఇలా చేయడం వల్ల మంచి, బలమైన టీ లభిస్తుంది. టీని అంతకంటే ఎక్కువ సేపు ఉడకబెట్టడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు నిపుణులు. చాలా మంది టీ రుచి కోసం టీ పొడిలో లవంగాలు, యాలకులు కలుపుతారు. ఎక్కువసేపు మరిగిస్తే వీటి వాసన రాదు.
చక్కెర టీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు హానికరం. అలాంటి వారు టీ తయారీలో చక్కెరకు బదులు తేనె, బెల్లం వంటివి వాడవచ్చు. ఇది టీని తీయగా, సాధారణ టీ కంటే భిన్నమైన రుచిని తెస్తుంది. అల్లం, ఏలకులు, తులసి టీకి రుచిని జోడిస్తాయి. ఈ పదార్థాలను కలిపి మెత్తగా చేసి వేడినీళ్లలో కలిపితే రుచి బాగుంటుంది. మీకు తులసి టీ నచ్చకపోతే రెండు లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క పొడిని జోడించవచ్చు.