టీచర్ అరెస్ట్: ఆమె ఒక టీచర్…! విద్యార్థులకు చదువు, సంస్కారం నేర్పాల్సిన వ్యక్తి…! కానీ ఆమే సంస్కారం మరిచింది…! విద్యార్థిని తండ్రితో ఎక్స్ట్రామారిటల్ అఫైర్ పెట్టుకుంది…!
ఆ తర్వాత, అతన్నుంచి డబ్బులు ఎక్కించింది…! మరో డబ్బులు డిమాండ్ చేస్తుండగా, అతను దూరం కావడానికి ప్రయత్నించాడు…! కానీ ఆమె వదిలేసేది కాదు…! ₹20 లక్షలు ఇవ్వకపోతే, వారి ప్రైవేట్ ఫోటోలు మరియు వీడియోలను అతని ఫ్యామిలీకి పంపిస్తానని బ్లాక్మెయిల్ చేసింది. చివరికి అతను పోలీసుల దగ్గరకు వెళ్లగా, ఆమె గేమ్ అంతమైంది.
వివరాల్లోకి వెళితే…
బెంగళూరులోని ఒక స్కూల్లో శ్రీదేవి రుదగి అనే మహిళ టీచర్గా పనిచేస్తోంది. అదే ఏరియాలో భార్య, ముగ్గురు కుమార్తెలతో నివసిస్తున్న ఒక బిజినెస్ మ్యాన్ సతీష్ తన 5 ఏళ్ల చిన్న కుమార్తెను అడ్మిషన్ కోసం స్కూల్కు వెళ్లాడు. ఈ సమయంలో, రుదగి మరియు సతీష్ మధ్య ఒక కనెక్షన్ ఏర్పడింది, ఇది చివరికి ఎక్స్ట్రామారిటల్ అఫైర్గా మారింది.
ఈ రిలేషన్షిప్ను ఉపయోగించుకుని, రుదగి సతీష్ నుండి ₹4 లక్షలు ఎక్కించింది. ఇంకా డబ్బులు డిమాండ్ చేస్తుండగా, అతను ఆమెతో కనెక్షన్ కట్ చేసుకోడానికి ప్రయత్నించాడు. కానీ రుదగి తన సహచరులు గణేష్ కాలే (38) మరియు సాగర్ (28) తో కలిసి సతీష్ పై ఒత్తిడిని పెంచింది.
₹20 లక్షలు ఇవ్వకపోతే, వారి ప్రైవేట్ వీడియోలు మరియు ఫోటోలను అతని భార్యకు పంపిస్తానని బెదిరించింది. భయపడిన సతీష్ తన ఫ్యామిలీని గుజరాత్కు షిఫ్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడు.
ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ (TC) కోసం స్కూల్కు వెళ్లినప్పుడు, అతనికి ఒక షాకింగ్ ఇన్సిడెంట్ ఎదురైంది. సతీష్ TC కోసం రుదగిని కలిసినప్పుడు, గణేష్ కాలే మరియు సాగర్ కూడా అక్కడే ఉన్నారు.
రుదగి తన వద్ద ఉన్న వీడియోలు మరియు ఫోటోలను చూపించి, “₹20 లక్షలు ఇస్తావా లేదా ఈ వీడియోలను నీ ఫ్యామిలీకి పంపాలా?” అని బ్లాక్మెయిల్ చేసింది. భయంతో కంగారుపడిన సతీష్ ₹15 లక్షలు ఇస్తానని ఒప్పుకుని బయటకు వచ్చాడు.
తర్వాత డబ్బులు ఇవ్వకపోవడంతో, రుదగి అతనికి ఫోన్ కాల్స్ మరియు మెసేజ్లు పెంచింది. ప్రతిరోజు అతన్ని బెదిరించడం కొనసాగించింది. చివరికి ఇంకా సహించలేక, సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. పోలీసులు విచారణ చేసి, రుదగి మరియు ఆమె సహచరులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు.