విద్యార్థులతో వంటలు చేయించిన ఉపాధ్యాయుల సస్పెన్షన్

కంగ్టి ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల, కళాశాల వసతి గృహంలో విద్యార్థులతో వంటలు చేయించిన ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సస్పెన్షన్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
కంగ్టి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల కళాశాలలో విద్యార్థులతో వంటలు చేసిన వార్తలు వెలువడడంతో వెంటనే కలెక్టర్ నారాయణఖేడ్ ఆర్ డి ఓ అశోక్ చక్రవర్తిని విచారణకు ఆదేశించారు.
ఆర్డీవో గురువారం పాఠశాలను సందర్శించి విద్యార్థులతో, సిబ్బందితో మాట్లాడి విద్యార్థులు వంట చేసిన విషయం వాస్తవమేనని కలెక్టర్ కు నివేదిక సమర్పించడంతో ఆర్డీవో ఆశోక్ చక్రవర్తి నివేదిక ఆధారంగా పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ జి. మహేష్, టి జి టి ( మ్యాథ్స్ ) ఉపాధ్యాయులు కె.శివకుమార్ లను సస్పెన్షన్ చేస్తూ జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనల ప్రకారం సస్పెన్షన్ కు గురైన ఉపాధ్యాయులు అందుబాటులో ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.