చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఆసీస్ వరల్డ్ రి​కార్డు బ్రేక్‌

సీసీ మహిళల ప్రపంచకప్‌-2025లో భారత జట్టు సెమీఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 53 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా..


తమ సెమీస్‌ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో హర్మన్‌ సేన ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టింది.

వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేసిన మన అమ్మాయిల జట్టు నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లకు 340 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో స్మృతి మంధాన(109), ప్రతికా రావల్(122) అద్భుతమైన సెంచరీలతో సత్తాచాటగా.. జెమీమా రోడ్రిగ్స్‌ (76 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది.

అనంతరం మళ్లీ వర్షం అంతరాయం కలిగించడంతో కివీస్ లక్ష్యాన్ని 44 ఓవర్లలో 325గా నిర్ణయించారు. కానీ న్యూజిలాండ్ లక్ష్య చేధనలో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 271 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఈ ఓటమితో కివీస్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఈ మ్యాచ్‌లో అదరగొట్టిన భారత మహిళల జట్టు ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.