TG: విద్యాసంస్థలకు సెలవు.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ సీఎస్

 జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills By-Election) పోలింగ్ నేపథ్యంలో నవంబర్ 11వ తేదీన నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.


ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన రామకృష్ణారావు(CS Ramakrishna Rao) ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. షేక్‌పేట తహసీల్దార్‌ కార్యాలయంలో ఈ నెల 21 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. 22న నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు.

24 వరకు ఉపసంహరణకు గడువు ఉంది. నవంబర్‌ 11న పోలింగ్‌, 14 కౌంటింగ్‌ చేయనున్నారు. సెలవు రోజులు మినహా మిగిలిన పనిదినాల్లో నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. కార్యాలయంలో నేరుగా లేదా.. డిజిటల్‌ విధానంలో దాఖలు చేసే అవకాశం కల్పించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.