తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. విద్యార్థుల విషయంలో గత టీఆర్ఎస్ గవర్నమెంట్ వెళ్లిన తీరుకు బిన్నంగా ఈ ప్రభుత్వం అడుగులేస్తోంది.
అధికారం చేపట్టిన వెంటనే పలు కీలక నోటిఫికేషన్స్ జారీ చేసిన రేవంత్ సర్కార్.. రీసెంట్ గానే మెగా డీఎస్సీ నిర్వహించి వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది మరో డీఎస్సీ ఉంటుందని చెబుతూ వస్తున్న గవర్నమెంట్, తాజాగా నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది.
రాష్ట్రంలో DSC ద్వారా మరో 6వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరోసారి స్పష్టం చేశారు. ఇప్పటికే మెగా DSC ద్వారా 11వేల ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పిన ఆయన.. గత 10 ఏళ్లలో BRS ప్రభుత్వం ఒక్క DSC కూడా వేయలేదని విమర్శించారు. చదువుకున్న విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు స్కిల్ యూనివర్సటీని స్థాపించామని, JNTUలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన తెలిపారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై తీవ్ర కసరత్తులు చేస్తూ ఒక్కొక్కటిగా ప్రజలకు శుభవార్తలు చెబుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మరో DSC కోసం కసరత్తులు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో 6వేల టీచర్ పోస్టులను భర్తీకై ఈ నోటిఫికేషన్ రానుంది. దీనిపై నిరుద్యోగుల్లో పలు అనుమానాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఈ డీఎస్సీ
తప్పకుండా ఉంటుందని పదేపదే చెబుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవలే TET నోటిఫికేషన్ కూడా జారీ చేసి అప్లికేషన్స్ తీసుకున్నారు. దీంతో విద్యార్థులు కూడా ప్రిపరేషన్ షురూ చేశారు.