తెలంగాణ డీఎస్సీ 2024 హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు గురువారం రాత్రి తెలంగాణ విద్యాశాఖ హాల్ టికెట్లను వైబ్‌సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.
జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే విద్యాశాఖ పూర్తి షెడ్యూల్‌ను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు సమయం చాలా తక్కువ ఇచ్చారని, డీఎస్సీ పరీక్షలు ముగిసిన ఒక రోజు తర్వాత గ్రూపు 2 పరీక్షలు కూడా ఉన్నాయని, కనీసం నెలపాటు డీఎస్సీని వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు రాష్ట్రంలో పలుచోట్ల నిరసనలు చేస్తున్నారు. అయితే అభ్యర్ధుల విన్నాపాలను పట్టించుకోని తన పంథాన తాను తాజాగా హాల్ టికెట్లను కూడా విడుదల చేసింది. హాల్‌టికెట్లను విద్యాశాఖ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని ప్రకటించడంతో పరీక్షల వాయిదా ఇక ఉండదని తేల్చినట్లైంది. మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీలకు డీఎస్సీ నిర్వహిస్తున్నారు.
తెలంగాణ డీఎస్సీ 2024 హాల్‌టికెట్ డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాగా మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరిలో తెలంగాణ సర్కార్ నోటిఫికేషన్ ఇచ్చింది. మార్చి 4 నుంచి జూన్ 20 వరకు దరఖాస్తులు స్వీకరించింది. డీఎస్సీ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 2,79,966 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఇక పరీక్షలు ఆయా తేదీల్లో రోజుకు రెండు షిఫ్టుల చొప్పున జరగనున్నాయి. 11,062 ఉద్యోగాల్లో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ (స్పెషల్ ఎడ్యుకేషన్) 796 పోస్టుల వరకు ఉన్నాయి.
తెలంగాణ డీఎస్సీ 2024 పరీక్షల పూర్తి షెడ్యూల్ ఇదే..
- జులై 18వ తేదీన మొదటి షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్
- జులై 18వ తేదీన సెకండ్ షిఫ్ట్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్
- జులై 19వ తేదీన సెకండరీ గ్రేడ్ టీచర్
- జులై 20వ తేదీన ఎస్‌జీటీ, సెకండరీ గ్రేడ్ ఫిజికల్, స్పెషల్ ఎడ్యుకేషన్
- జులై 22వ తేదీన స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్
- జులై 23వ తేదీన సెకండరీ గ్రేడ్ టీచర్
- జులై 24వ తేదీన స్కూల్ అసిస్టెంట్- బయలాజికల్ సైన్స్
- జులై 26వ తేదీన తెలుగు భాషా పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్
- జులై 30వ తేదీన స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్