తెలంగాణ ఎడ్ సెట్, పీఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది

www.mannamweb.com


టీజీ ఎడ్ సెట్, పీఈసెట్ కౌన్సెలింగ్ తేదీలను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ నెల 31 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

తెలంగాణ ఎడ్ సెట్, పీఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. టీజీ ఎడ్‌సెట్, టీజీ పీఈసెట్ కోర్సుల్లో ప్రవేశాలకు జులై 31 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

టీజీ ఎడ్ సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్

టీజీ ఎడ్‌సెట్ తో బీఈడీ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఎడ్ సెట్ లో అర్హత సాధించిన అభ్యర్థులు ఆగ‌స్టు 8 నుంచి 20వ తేదీ వ‌ర‌కు స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలి. అనంతరం ఈ తేదీల్లోనే అభ్యర్థులకు స‌ర్టిఫికెట్ల వెరిఫికేష‌న్ నిర్వహిస్తారు. ఆగస్టు 12 నుంచి 16 వరకు స్పో్ర్ట్స్, ఎన్‌సీసీ, సీఏపీ, పీహెచ్ కేటగిరీల అభ్యర్థుల స‌ర్టిఫికెట్ల వెరిఫికేష‌న్ ఉంటుంది. ఆగస్టు 21న అభ్యర్థుల జాబితాను విడుద‌ల చేస్తారు. ఆగస్టు 22, 23వ తేదీల్లో అభ్యర్థులు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. వచ్చే 24న వెబ్ ఆప్షన్స్‌ ఎడిట్ కు అవ‌కాశం కల్పిస్తారు. ఆగస్టు 30న మొదటి విడత సీట్ల కేటాయింపు లిస్ట్ విడుద‌ల చేయ‌నున్నారు. తొలి విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 31 నుంచి సెప్టెంబ‌ర్ 4 వ‌ర‌కు ఒరిజిన‌ల్ స‌ర్టిఫికెట్లతో ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆగ‌స్టు 31 నుంచి బీఈడీ త‌ర‌గ‌తులు ప్రారంభం కానున్నాయి.
టీజీ పీఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్

టీజీ పీఈసెట్ ద్వారా ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. పీఈసెట్ లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఆగ‌స్టు 7 నుంచి 14 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేష‌న్, స‌ర్టిఫికెట్ల వెరిఫికేష‌న్ నిర్వహించనున్నారు. ఆగస్టు 13, 14వ తేదీల్లో స్పోర్ట్, ఎన్‌సీసీ, సీఏపీ, పీహెచ్ కోటా అభ్యర్థుల స‌ర్టిఫికెట్ల వెరిఫికేష‌న్ ఉంటుంది. ఆగస్టు 14న అభ్యర్థుల జాబితాను విడుద‌ల చేస్తారు. ఆగస్టు 16, 17 తేదీల్లో వెబ్ ఆప్షన్స్ కు అవకాశం కల్పిస్తారు. ఆగస్టు 18న వెబ్ ఆప్షన్స్‌ ఎడిట్ కు అవ‌కాశం క‌ల్పిస్తారు. ఆగస్టు 20న పీఈసెట్ మొదటి విడత సీట్ల కేటాయింపు జాబితా విడుద‌ల చేస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 21 నుంచి 24 వ‌ర‌కు ఒరిజిన‌ల్ స‌ర్టిఫికెట్లతో ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆగ‌స్టు 27 నుంచి త‌ర‌గ‌తులు ప్రారంభం కానున్నాయని ఉన్నత విద్యామండలి ప్రకటించింది.