తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి కానుక – ఫలించిన నిరీక్షణ, ఖాతాల్లో జమ

తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి వేళ కీలక నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వచ్చిన తరువాత వరుసగా పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న హామీల అమలు పైన ఫోకస్ చేసింది.


ఉద్యోగుల బకాయిలను ప్రతీ నెలా నిర్దేశించిన మొత్తంలో విడుదల చేస్తోంది. మహిళలకు ఆర్దికంగా చేదోడుగా నిలిచేందుకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలను సిద్దం చేస్తోంది. అదే సమయం లో ప్రస్తుత పథకాల అర్హత ఉండీ.. లబ్దిదారులు కాలేకపోయిన వారికి మరో ఛాన్స్ ఇవ్వాలని తాజా గా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది.

తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలకు అర్హత ఉన్నా ఇప్పటికీ లబ్ది పొందినవారి కోసం మరో అవకాశం కల్పించాలని డిసైడ్ అయింది. అర్హత ఉన్న అందరికీ అవకాశం ఇవ్వాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. అందు కోసం వీరి నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు కొత్తగా విధి విధానాలు ఖరారు చేసింది. ప్రతీ మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీసుల్లో ప్రజా పాలన అధికారులను నియమించిన ప్రభుత్వం వీరి ద్వారా మీరు పథకాలను దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. దరఖాస్తులను అధికారులు పరిశీలించి మిమ్మల్ని ఆయా పథకాల లబ్దిదారుల జాబితాల్లో చేర్చనున్నారు. గతంలో కొంతమందికి రేషన్ కార్డులు లేకపోవడం, వివరాల్లో తప్పులు దొర్లడంతో పథకాలకు అర్హత సాధించలేకపోయిన విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది.

కాగా, ప్రభుత్వం ఈ తాజాగా కొత్త రేషన్ కార్డులను జారీ చేసింది. దీంతో కొత్తగా రేషన్ కార్డు వచ్చినవారు ప్రభుత్వ పథకాలకు అర్హత సాధించారు. దీంతో కొత్తగా రేషన్ కార్డు పొందినవారు ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఎంపీడీవో ఆఫీసులను సంప్రదించి దరఖాస్తు పెట్టుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇక మున్సిపల్ వార్డుల్లో కూడా ప్రజా పాలన అధికారులను నియమిం చింది. వీరికి కూడా దరఖాస్తులను సమర్పించవచ్చని అధికారులు వెల్లడించారు. గతంలో దర ఖాస్తు చేసుకోనివారితో పాటు గతంలో తప్పుల వల్ల లబ్ది పొందనివారు ఇప్పుడు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. గృహలక్ష్మి, గ్యాస్ సబ్సిడీ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అందించే గృహలక్ష్మి పథకం కోసం ఆధార్, రేషన్ కార్డు, కరెంట్ బిల్లులను సమర్పించాలి. ఇక మహాలక్షి పథకం ద్వారా రూ.500కే గ్యాస్ సిలిండర్ పొందాలంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, గ్యాస్ పాస్ బుక్, బ్యాంక్ అకౌంట్ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. లబ్దిదారులకు నేరుగా అకౌంట్లో నిధులు జమ చేయనున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.