గ్యాంబ్లింగ్, మోసాలు, నేరపూరిత కార్యకలాపాలకు సహకరిస్తుందనే ఆరోపణల నేపథ్యంలో టెలిగ్రామ్‌పై భారత ప్రభుత్వం విచారణ చేస్తోంది. ఎక్వైరీలో ఏవైన క్రిమినల్ యాక్టివిటీస్ లేదా కీలక విషయాలు బయటపడితే వాటి ఆధారంగా టెలిగ్రామ్ యాప్‌ను ఇండియాలో బ్యాన్ చేసే అవకాశం ఉంది. కేంద్ర హోం, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖల నేతృత్వంలో ఈ యాప్‌పై విచారణ జరుగుతోంది. సెక్షన్ 14C ప్రకారం దర్యాప్తు సాగుతోంది. గత కొన్నేళ్లుగా టెలిగ్రామ్‌లో క్రిమినల్ యాక్టివిటీస్ పెరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
విచ్చలవిడిగా పోర్న్ వీడియోల అప్‌లోడింగ్, షేరింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ట్రేడింగ్ పేరుతో స్టాక్‌మార్కెట్ మోసాలు జరుగుతున్నాయి. సైబర్ క్రిమినల్స్‌కి ప్లాట్‌ఫామ్‌గా మారింది. డేంజర్ గేమ్స్, గ్యాంబ్లింగ్‌కి కూడా టెలిగ్రామ్ వేదికైంది. పైరసీ మూవీలకూ టెలిగ్రామే అడ్డాగా మారింది. అంతేకాకుండా డ్రగ్స్ అక్రమ రవాణా, హింసను ప్రేరేపించే కంటెంట్ టెలిగ్రామ్‌లో ఎక్కువగా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇండియన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్‌ను 50% కూడా ఫాలోఅవ్వడం లేదని టెలిగ్రామ్‌పై ఆరోపనలు ఉన్నాయి. UGC-NEET వివాదంపై కూడా టెలిగ్రామ్ వార్తల్లో నిలిచింది. దీంతో టెలిగ్రామ్ యాప్ పారదర్శకతపై చర్చజరుగుతోంది. ఇప్పటికే టెలిగ్రామ్ కారణంగా ఫ్రాన్స్‌లో క్రిమినల్ యాక్టివిటీ పెరిగిందని యాప్ ఓనర్ పావెల్ డ్యురావ్‌ను అరెస్ట్ చేశారు. ఇండియన్ గవర్నమెంట్ చేపట్టిన దర్యాప్తులో అక్రమాలు నిజమే అని తేలితే యాప్‌పై నిషేధం విధించే అవకాశం ఉంది.