మా తెలుగు టీచర్‌కి తెలుగే రాదు.. కలెక్టర్‌కి విద్యార్థుల ఫిర్యాదు
గుంటూరు జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు కలెక్టరేట్‌ను ఆశ్రయించారు. తమ టీచర్‌కు తెలుగు చెప్పడం రావడంలేదని తక్షణమే ఆయనను మార్చి కొత్త తెలుగు ఉపాధ్యాయుడిని నియమించాలని కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సబ్జెక్టుపై పట్టులేని వారిని ఉపాధ్యాయులుగా నియమించి ప్రభుత్వ పాఠశాలలను ఏ పరిస్థితికి తీసుకొచ్చరోనని జనం వాపోతున్నారు. టీచర్లకే తెలుగు రాకపోతే ఇక విద్యార్ధులకు ఏం నేర్పిస్తారని మండిపడుతున్నారు.
గుంటూరు జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు కలెక్టరేట్‌ను ఆశ్రయించారు. తమ టీచర్‌కు తెలుగు చెప్పడం రావడంలేదని తక్షణమే ఆయనను మార్చి కొత్త తెలుగు ఉపాధ్యాయుడిని నియమించాలని కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సబ్జెక్టుపై పట్టులేని వారిని ఉపాధ్యాయులుగా నియమించి ప్రభుత్వ పాఠశాలలను ఏ పరిస్థితికి తీసుకొచ్చరోనని జనం వాపోతున్నారు. టీచర్లకే తెలుగు రాకపోతే ఇక విద్యార్ధులకు ఏం నేర్పిస్తారని మండిపడుతున్నారు. జిల్లాలోని పెదరావూరు జిల్లా పరిషత్ పాఠశాలలో తెలుగు టీచర్ కు తెలుగు చెప్పడమే రావడం లేదంటూ విద్యార్ధులు తమ తల్లిదండ్రులను వెంటపెట్టుకొని కలెక్టర్‌లో ఫిర్యాదు చేశారు. HM కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్ధినిలు. తమకు తెలుగు బోధిస్తున్న ఉపాధ్యాయుడు నాగేశ్వరరావుకు తెలుగు రావడంలేదని, అక్షరాలను తప్పుగా రాయిస్తున్నారంటూ వాపోయారు. తక్షణం తెలుగు టీచర్ నాగేశ్వరరావును మార్చి తమకు తెలుగు తెలిసిన టీచర్‌ను అపాయింట్ చెయ్యాలని డిమాండ్ చేశారు.