రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల(Tenth Exams) షెడ్యూల్ విడులైంది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.
ఉదయం 9.30 నుంచి 12.45 వరకు పరీక్షలు జరగతాయని అధికారులు తెలిపారు. మార్చి 3న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకండ్ లాంగ్వేజ్, 20న ఇంగ్లీష్, 23న మ్యాథ్స్, 25న ఫిజికల్ సైన్స్, 28న సోషల్ స్టడీస్, 31న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-11 (కంప్యూటర్ కోర్స్), ఓఎస్ఎస్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1(సంస్కృతం, అరబిక్, ఫెర్సియన్), ఏప్రిల్ -1న ఓఎస్ఎస్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-11(సంస్కృతం, అరబిక్, ఫెర్సియన్), ఎస్ఎస్సీ వోకేషనల్ కోర్స్ (థియరీ) పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.































