Tenth Exams: ఇకపై ఏడాదికి రెండుసార్లు పది పరీక్షలు

టెన్త్ క్లాస్ పరీక్షలపై సీబీఎస్‌ఈ కీలక ప్రకటన చేసింది. 2026 నుండి సంవత్సరానికి రెండుసార్లు 10వ తరగతి పరీక్షలు నిర్వహించడానికి ఆమోదం తెలిపింది.


ఫిబ్రవరి – మే నెలల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. మొదటి దశ పరీక్షలకు హాజరు కావడం తప్పనిసరి అని, రెండో దశ పరీక్ష ఆప్షనల్ అని సీబీఎస్‌ఈ వెల్లడించింది. మొదటి దశ పరీక్షలు ఫిబ్రవరిలో, రెండవ దశ పరీక్షలు మేలో నిర్వహిస్తారు. వీటి ఫలితాలు వరుసగా ఏప్రిల్, జూన్‌లలో ప్రకటిస్తారు. అయితే విద్యార్థులు సైన్స్, గణితం, సాంఘిక శాస్త్రం, భాషలలోని ఏవైనా మూడు సబ్జెక్టులలో వారి స్కోర్‌ను పెంచుకోవడానికి రెండో దశ పరీక్షలు రాయాలి. ఫిబ్రవరిలో CBSE ముసాయిదా నిబంధనలను ప్రకటించింది. తాజాగా వీటికి ఆమోదం లభించింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.