ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మాస్క్‌కు చెందిన కార్ల కంపెనీ టెస్లా భారత్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. భారత్‌లో తమ కార్ల విక్రయాలను ఎప్పుడో ప్రారంభించగా..
ఇప్పుడు మరింతగా విస్తరించే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా భారత్‌లో ఫుల్‌స్కేల్ రిటైర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఏర్పాటుకు మందడుగు వేసింది. బుధవారం ఈ సెంటర్‌ను అధికారికంగా ప్రారంభించింది. గురుగ్రామ్‌లోని ఆర్కిడ్ బిజినెస్ పార్క్‌లో ఈ సెంటర్ ఏర్పాటు కావడంతో టెస్లా భారత మార్కెట్‌లో ఇతర కార్ల కంపెనీలకు పోటీగా తన బ్రాండ్, బిజినెస్‌ను పెంచనుందని తెలుస్తోంది.
ఇప్పటికే టెస్లాకు ముంబైలోని కుర్లా కాంప్లెక్స్, ఢిల్లీలోని ఏరోసిటీల్లో ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు ఉన్నాయి. కానీ వాటితో సంబంధం లేకుండా దీనిని డిఫరెంట్ కాన్సెప్‌తో ప్రారంభించారు. బుకింగ్‌లు, టెస్ట్ డ్రైవ్స్, బ్రాండ్ ప్రమోషన్ సెంటర్‌గా ఇది ఉండనుంది. మరింత రిటైర్ నెట్వర్క్‌గా మార్చేందుకు ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఉపయోగపడుతుందని టెస్లా వర్గాలు స్పష్టం చేశాయి. ఈ సెంటర్ కోసం ఒక హెడ్‌ను కూడా టెస్లా వర్గాలు ఇప్పటికే నియమించాయి. గతంలో ఆడి ఇండియాలో సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన అగర్వాల్‌ను కొత్త సెంటర్‌కు హెడ్‌గా టెస్లా నియమించింది. భారత మార్కెట్లో ఈవీ మార్కెట్‌ను మరింతగా పెంచుకునేందుకు అతడికి బాధ్యతలు అప్పగించింది.
ప్రస్తుతం భారత మార్కెట్‌లో టెస్లా అమ్మకాలు అంతగా జరగడం లేదు. 2025 ప్రారంభంలోనే టెస్లా ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది. రెండు వేరియెంట్లలో కార్లను లాంచ్ చేసింది. ఒక వేరిమెంట్ ధర రూ. 59.89 లక్షలుగా ఉండగా.. రెండో వేరియంట్ ధర రూ.67.89 లక్షలుగా ఉంది. సెప్టెంబర్, అక్టోబర్‌లో కేవలం 104 యూనియట్లను మాత్రమే టెస్లా విక్రయించింది. ఈ కార్లన్నీ దిగుమతి చేసుకున్నవే. అంతర్జాతీయంగా 4.97 లక్షల యూనిట్లను విక్రయించిన టెస్లా.. భారత్‌లో మాత్రం వెనుకబడి పోయింది. స్థానికంగా తయారీ పరిశ్రమ లేకపోవడం, పూర్తిగా దిగుమతి మీదనే ఆధారపడటమే కారణంగా తెలుస్తోంది. ఇక కొత్త షోరూంల ఏర్పాటుపై కూడ టెస్లా దృష్టి పెట్టలేదు.



































