Thalliki Vandanam scheme: తల్లికి వందనం పథకంపై వదంతులు నమ్మొద్దు.. ప్రభుత్వం స్పష్టత
Thalliki Vandanam scheme: ఆంధ్రప్రదేశ్‌లో సూపర్ సిక్స్ లాంటి హామిలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది.
ఇప్పటికే రూ 4 వేల పెన్షన్‌ను ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. అయితే ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థలు తల్లిదండ్రులకు రూ. 15 వేల చొప్పున తల్లికి వందనం పేరుతో ప్రకటించారు. అయితే ఆ పథకానికి అర్హత సాధించాలంటే రేషన్ కార్డు ఉండాలి, ఇంటిలో ఒక్కరికి మాత్రమే వర్తిస్తుంది అని పలు రకాల వార్తలు చెక్కర్లు కొడతున్నాయి. అంతేకాదు ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు అంటూ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఈ మార్గదర్శకాలపై స్పందించింది.
ఇప్పటి వరకు తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదని, సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న వార్తలను ఎవరు నమ్మొద్దని స్పష్టం చేసింది. త్వరలోనే ప్రభుత్వమే అన్ని విషయాలను వెల్లడిస్తుందని, ఈ విషయంలో ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పింది. గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో నగదును తల్లుల ఖాతాలో జమ చేసింది. ఇంట్లో ఎంత మంది పిల్లలు పాఠశాలకు వెళ్తున్న ఒక్కరికి మాత్రమే అది నిర్వాహణ ఖర్చుల పేరుతో వెయ్యి రూపాలను కట్ చేసి మొత్తం 14 లక్షలు ఖాతాలో వేసింది. ఎన్నికల హామీలో ఎన్డీయే కూటమి ప్రతీ విద్యార్థికి తల్లికి వందనం వర్తిస్తుందని చెప్పారు. దీనిపై జనసేనాని పవన్ కల్యాణ్ సైతం స్పష్టం చేశారు. దీనికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన 29 జీవోలో ఒక తల్లికి 15 వేలు అని ఉంది. దీంతో ఈ గందరగోలం ప్రారంభం అయింది. దీనిపై త్వరలో ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వనుంది.