‘ఆ వ్యాధి తినేస్తోంది.. రోజు రోజుకు శరీరం ఎండిపోతూ’

చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఎవరి కెరీర్ ఎలా ఉంటుందో తెలియదు. ఉన్న నాలుగు రోజుల్లోనే జీవితాలన్ని చక్కదిద్దుకోవాలి. ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్‌లలో నటీనటుల కష్టాలు బయటకు వస్తున్నాయి.


ఏళ్లపాటు తమ పరిస్ధితి బయటి ప్రపంచానికి తెలియకుండా గుట్టుగా ఉంచి నరకం అనుభవిస్తున్న వారెందరో. అనారోగ్యం కారణంగా చిత్ర పరిశ్రమకు దూరమై శారీరకంగా, మానసికంగా కుంగిపోతున్న వారు చాలా మంది ఉన్నారు. తాజాగా తన అనారోగ్యాన్ని బయట పెట్టారు ఒకప్పటి హీరోయిన్, ఆనందం ఫేమ్ రేఖ వేదవ్యాస్.

రేఖ వేదవ్యాస్ అంటే ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు.. కానీ ఒకప్పుడు తన అందం, నటన, చిరునవ్వుతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేశారు. అందం, జాబిలి, ఒకటో నెంబర్ కుర్రాడు, మన్మథుడు వంటి సినిమాలతో హల్‌చల్ చేశారు. వరుస బ్లాక్‌బస్టర్స్‌తో స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత అడ్రస్ లేకుండాపోయారు. కన్నడ అమ్మాయి కావడంతో శాండిల్‌వుడ్‌లోనే ఎక్కువ సినిమాలు చేసిన రేఖ.. టాలీవుడ్‌కు పూర్తిగా దూరమయ్యారు. 2008లో వచ్చిన నిన్న నేడు రేపు సినిమాలో చివరిసారిగా తెలుగువారిని పలకరించారు రేఖ వేదవ్యాస్. 2014 నుంచి కన్నడ సినిమాలలోనూ కనిపించలేదు రేఖ.

చానాళ్ల తర్వాత ఇంటర్వ్యూ

దాదాపు పదేళ్లుగా చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్న రేఖ .. అలీతో సరదాగా, వావ్ వంటి షోలతో తిరిగి తెలుగువారిని పలకరించారు రేఖ. అయితే ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమంలో రేఖను చూసి అంతా షాక్ అయ్యారు. బక్క చిక్కిపోయి, అసలు ఈమె రేఖయేనా కాదా అంటూ ప్రేక్షకులు ఆవేదన వ్యక్తం చేశారు. రేఖకి ఏమైంది? ఎందుకిలా అయిపోయింది? అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రేఖ వేదవ్యాస్.. తన కెరీర్, అనారోగ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

రోజుకు రోజుకు చిక్కిపోతూ

2014 నుంచి కోవిడ్ ముందుకు వరకు వ్యక్తిగత కారణాలతో సినిమాలకు దూరమయ్యాయని రేఖ తెలిపారు. ఏ అనారోగ్య సమస్య వచ్చినా కొన్నేళ్లు ఉంటుందని, కానీ నా అనారోగ్యం కొన్నేళ్ల పాటు నడిచిందని, దీని కారణంగా శారీరకంగా, మానసికంగా కృంగిపోయానని రేఖ గుర్తుచేసుకున్నారు. మీరు ఒకటి అనుకుంటే దేవుడు మరొకటి ప్లాన్ చేస్తాడని.. దానిని అనుభవించాల్సిందేనని ఆమె చెప్పారు. కెమెరా ముందు పనిచేస్తే వచ్చే కిక్ వేరనని.. ఇంత జరిగినా రీ ఎంట్రీ ఇవ్వడానికి కారణాలు రెండు..సినిమా అనేది నా ప్యాషన్ అని, రెండోది మెడికల్ బిల్స్ కట్టాలని రేఖ తెలిపారు. కానీ ఆ వ్యాధి ఏంటీ? రోజు రోజుకు శరీరం ఎందుకు ఇలా బక్కచిక్కిపోతున్నది మాత్రం రేఖ బయటపెట్టలేదు. కానీ ఆమె మాత్రం ఏదో ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్నట్లుగానే రేఖ మాటలు చెబుతున్నాయి.

అతని కోసం వెయిట్ చేస్తా

ఇదే ఇంటర్వ్యూలో తను ఎందుకిలా సింగిల్‌గా ఉన్న విషయంపైనా రేఖ ఓపెన్ అయ్యారు. ఇటీవలి కాలంలో విడాకులు బాగా పెరిగిపోతున్నాయని, అందుకే సరైన వ్యక్తి కోసం వెయిట్ చేస్తున్నానని.. అప్పుడే వివాహ బంధంలో అడుగుపెట్టాలని అనుకుంటున్నానని రేఖ వేదవ్యాస్ పేర్కొన్నారు. పెళ్లి ఆలస్యమైనా సరే.. జీవితాంతం ఆ బంధం కొనసాగేలా చూసుకుంటానని పేర్కొన్నారు. ప్రస్తుతం రేఖ వేదవ్యాస్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.