మెట్లు ఎక్కేటప్పుడు ఇప్పుడు ఏ కాలు ముందు పెడుతున్నారు. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే.. ఎందుకంటే మెట్లు ఎక్కేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీరు చాలా లాస్ అవుతారు. మిగతా వివరాలు ఇలా తెలుసుకుందాం..
చాలా మంది రోజంతా ల్యాప్ టాప్‌లు లేదా టేబుళ్లపై ముఖం పెట్టి పని చేస్తారు. శరీరాన్ని చురుకుగా ఉంచడానికి సమయం కేటాయించడం కష్టమవుతుంది.
అందుకే చాలా మంది ఆఫీసుల్లో లేదా ఇళ్లలో లిఫ్టులకు బదులుగా మెట్లు ఎక్కడం, దిగడం చేస్తుంటారు. అయితే, అక్కడే పెద్ద తప్పులు జరుగుతుంటాయి.
ఈ విషయంలో సూరత్‌లోని ఆర్థోపెడిక్ సర్జన్ రాజీవ్ రాజ్ చౌదరి మాట్లాడుతూ, మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు తప్పులు చేస్తే కండరాలపై ప్రభావం పడుతుందని, దాని వల్ల కండరాల సమస్యలు వస్తాయని తెలిపారు.
మెట్లు ఎక్కేటప్పుడు చాలా మంది కేవలం పాదాల ముందు భాగాన్ని మాత్రమే ఉంచుతారు. అక్కడే సమస్య వస్తుంది. ఈ విషయంలో రాజీవ్ చౌదరి మాట్లాడుతూ, “మెట్లపై పాదాలను ఎంత వరకు ఉంచాలో చాలా మందికి తెలియదు” అని అన్నారు.
మెట్లు ఎక్కేటప్పుడు కొందరు కేవలం పాదాల ముందు భాగాన్ని మాత్రమే ఉంచుతారు. సమస్య అక్కడే మొదలవుతుంది. అయితే, పాదాన్ని పూర్తిగా ఉంచి మెట్లు ఎక్కడం సరైన పద్ధతి. అందుకే మెట్లు ఎక్కేటప్పుడు మొదటి అడుగు చాలా ముఖ్యం
మెట్లు దిగేటప్పుడు మాత్రం దీనికి వ్యతిరేకంగా చేయాలని వైద్యులు చెబుతున్నారు. ఈ విషయంలో రాజీవ్ చౌదరి మాట్లాడుతూ, “మెట్లు దిగేటప్పుడు బలహీనమైన కాలును ముందు ఉంచాలి. లేకపోతే మోకాళ్ల నొప్పులు మొదలవుతాయి” అని అన్నారు.
అదేవిధంగా, మోకాళ్లపై ఒత్తిడి తగ్గించడానికి నెమ్మదిగా ఎక్కడం, దిగడం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. చాలా వేగంగా మెట్లు ఎక్కి దిగితే మోకాళ్ల నొప్పులు పెరుగుతాయి. ఇప్పటికే కాలు నొప్పులు ఉంటే మెట్లు ఎక్కడం మానుకోవడం మంచిది. ఒకవేళ మెట్లు ఎక్కాల్సి వస్తే రెయిలింగ్‌ను ఉపయోగించాలి.