విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన AP ప్రభుత్వం.. స్కూల్స్ తెరవక ముందే

విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన AP ప్రభుత్వం.. స్కూల్స్ తెరవక ముందే


రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో వేసవి సెలవులు ముగియనున్నాయి. జూన్ 12న బడులు తిరిగి పున:ప్రారంభం కాబోతున్నాయి. ఎండాకాలం సెలవుల్లో ఎంజాయ్ చేసిన విద్యార్థులు బడిబాట పట్టే టైమ్ రానే వచ్చింది. ఈ క్రమంలో త్వరలోనే బడి గంట మోగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు అదిరిపోయే శుభవార్తను అందించింది. విద్యార్థుల కోసం రెండు భారీ కానుకలను అందించేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే విద్యార్ధుల భవిష్యత్ కోసం.. నాణ్యమైన విద్య కోసం ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. ఆధునిక వసతులతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చి విద్యార్థులకు కార్పోరేట్ స్థాయి విద్యనందిస్తోంది ఏపీ ప్రభుత్వం.

ఆంధ్రప్రదేశ్ లోని విద్యార్థులకు ప్రభుత్వం మరో తీపి కబురును అందించింది. విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఏటా అందించే కిట్లు జూన్ 12 నాటికే పాఠాశాలలకు పంపిణీ చేసి. అనంతరం పాఠశాల్లో విద్యార్థులకు కిట్లు పంపిణీ చేస్తారు. ఈ విషయాన్ని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు‌. ఏపీలో విద్యాకానుకను 2021 ఆగస్టు 16న ప్రారంభించారు. ఈ పథకం కింద ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు ఎనిమిది ఐటమ్స్ తో కిట్లు ఇస్తారు.

రెండు జతల స్కూల్ యూనిఫాం (స్టిచింగ్ ఛార్జీలుతో సహా), పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, తెలుగు-ఇంగ్లిష్ ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ, స్కూల్ బ్యాగ్, బెల్టు, రెండు జతల నలుపు షూస్, రెండు జతల సాక్సులతో కూడి‌న కిట్లు ప్రతి విద్యార్థికి అందజేస్తారు. ఈ కిట్లు జూన్ 5 నాటికి అన్ని స్కూల్స్ కు షూస్ రవాణా పూర్తి చేయనున్నారు. పాఠశాలలు తెరుచుకునే సమయానికి విద్యార్థులందరికీ స్కూల్ కిట్స్ ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు.‌ ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు 44,57,441 మంది ఉన్నారు. వీరందరికీ విద్యా కానుక కిట్లును అందించనున్నారు. ఉచిత పాఠ్య పుస్తకాలను సైతం స్కూల్స్ ఓపెన్ అయ్యేనాటికి విద్యార్థులకు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.