ముఖంపై మచ్చలను సహజంగా తొలగించడానికి ఉత్తమ ఇంటి చిట్కాలు మీకోసం

www.mannamweb.com


ముఖంపై చాలా మందికి ముదురు రంగు మచ్చలు ఉంటాయి. ఎన్ని రకాల క్రీములు, సీరంలను రాసినా కూడా ఇవి ఓ పట్టాన పోవు. ఈ మచ్చలు ముఖంలో మెరుపును దూరం చేస్తాయి.
చర్మం( Skin ) ఎంత తెల్లగా మృదువుగా ఉన్నా కూడా కాంతిహీనంగానే కనిపిస్తుంది. అందుకే ముఖంపై మచ్చలను వదిలించుకునేందుకు ముప్ప తిప్పలు పడుతుంటారు. అయితే ముఖంపై మచ్చలు( Dark Spots ) సహజంగా తొలగించడానికి కొన్ని ఉత్తమ ఇంటి చిట్కాలు కొన్ని ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు టొమాటో ప్యూరీ( Tomato Puree ) వేసుకోవాలి. అలాగే వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon Juice ) వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసుకోవాలి. 15 నిమిషాల పాటు ఆరబెట్టుకుని ఆపై వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. టొమాటో మరియు నిమ్మరసంలో ఉండే పలు సమ్మేళనాలు మొండి మచ్చలకు వ్యతిరేకంగా పోరాడతాయి. కొద్ది రోజుల్లోనే క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ను అందిస్తాయి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ మెంతులను( Fenugreek Seeds ) నైట్ అంతా వాటర్ లో నానబెట్టి ఉదయాన్నే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్( Sweet Almond Oil ) మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసుకోవాలి. పూర్తిగా డ్రై అయ్యాక కడిగేయాలి. ఇలా రోజు చేసినా కూడా ముఖం పై ఏర్పడిన మచ్చలు మాయం అవుతాయి. మరియు చర్మం యవ్వనంగా మారుతుంది. ఇక మరొక చిట్కా కూడా ఉంది. దానికోసం వన్ టేబుల్ స్పూన్ బార్లీ గింజల పొడిలో పావు టీ స్పూన్ పసుపు మరియు రెండు స్పూన్ల పెరుగు వేసి బాగా కలిపి ముఖానికి పట్టించాలి. 15 నిమిషాల పాటు ఆరబెట్టుకుని ఆపై వాటర్ తో క్లీన్ చేసుకోవాలి. ముదురు రంగు మచ్చలతో బాధపడుతున్న వారు ఈ రెమెడీని పాటిస్తే మంచి రిజల్ట్ ఉంటుంది.