ప్రేమ పెళ్లి, సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా లేని చోట భార్యను బంధించే కసాయి మొగుడు. సీను సీనుకో ట్విస్టుతో బెస్ట్ థ్రిల్లర్

www.mannamweb.com


ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఒక ఫాంటసీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మూడు నెలలు క్రితం వచ్చిన ఈ తమిళ్ ఫాంటసీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ, ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్ లో మూవీ లవర్స్ ని భయపెట్టడానికి సిద్ధంగా ఉంది.

ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో ఇద్దరు భార్య, భర్తలు ఉద్యోగం కోసం ఒక కొండ ప్రాంతంలోకి వెళతారు. అయితే అక్కడ వీళ్ళు ఎదుర్కొనే సమస్యలతో స్టోరీ రన్ అవుతుంది. ఇటువంటి ఫాంటసీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను మూవీ లవర్స్ బాగా ఇస్ట పడతారు. ఈ థ్రిల్లర్ మూవీ పేరేమిటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…

ఆహా (aha) లో

ఈ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఆరగన్‘ (Aaragan). అక్టోబర్ 4, 2024లో థియేటర్లలో విడుదలైన, ఈ తమిళ ఫాంటసీ థ్రిల్లర్ మూవీకి అరుణ్ కెఆర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మైఖేల్ ,కవిప్రియ, మనోహరన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మధ్య హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ సినిమాలకు తెలుగులో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ జనవరి 3, 2025 నుంచి ఆహా (aha) ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ లోకి వెళితే

శర్వనన్, మగిజిని ప్రేమ వివాహం చేసుకుంటారు. వీరి జీవితం హ్యాపీగా సాగిపోతున్న క్రమంలో శర్వనన్ , మగజిని ఒక కొండ ప్రాంతంలో ఉద్యోగం చేయడానికి వస్తారు. ఈ క్రమంలో కొత్త జీవితంలోకి వెళుతున్నామని సంబరపడ్డ ఈ జంటకి, అక్కడికి వెళ్లిన తర్వాత ఊహకు అందని పరిణామాలతో ఇబ్బందులు ఎదురౌతాయి. ఒక వృద్ధురాలిని చూసుకొనే క్రమంలో మగిజినికి సమస్యలు స్టార్ట్ అవుతాయి . సెల్ఫోన్ సిగ్నల్స్ కూడా ఆ ప్రాంతంలోకి రాకపోవడంతో హీరోయిన్ బాగా భయపడుతుంది.మగిజిని ఆ కొండ ప్రాంతంలో ఒక చోట బందీ అవుతుంది. చివరికి హీరోయిన్ తన భర్త గురించి కొన్ని భయంకరమైన నిజాలు తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఆమె తన భర్తతో ఎదుర్కొనే సన్నివేశాలతో మూవీ స్టోరీ రన్ అవుతుంది.

చివరికి హీరోయిన్ ఆ ప్రాంతం నుంచి బయటపడగలుగుతుందా? శర్వనన్, మగజిని నుంచి దాచిన విషయాలు ఏమిటి? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా (aha)లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ఆరగన్’ (Aaragan) మూవీని మిస్ కాకుండా చూడండి. ఈ మూవీలో ట్విస్టులతో భయపెట్టే సన్నివేశాలు ఉన్నాయి. అయితే స్క్రీన్ ప్లే అంతగా ఆకట్టుకునే విధంగా ఉండదు. మొత్తానికి ఈ మూవీ థియేటర్లలో మంచి విజయాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్ లో భయపెట్టడానికి ఈ ఫాంటసీ థ్రిల్లర్ వచ్చింది. ట్విస్ట్ లతో సాగిపోయే ఈ మూవీ చివరివరకు అలాగే కొనసాగుతుంది. మరి ఎందుకు ఆలస్యం మూవీ లవర్స్ థ్రిల్ అవ్వడానికి ఇంట్లోనే కూర్చుని, ఈ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ పై ఓ లుక్ వేయండి.

The post OTT Movie : ప్రేమ పెళ్లి, సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా లేని చోట భార్యను బంధించే కసాయి మొగుడు… సీను సీనుకో ట్విస్టుతో బెస్ట్ థ్రిల్లర్