ఫాస్టాగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం..! ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్తంగా అమలు

కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. 3 వేలు చెల్లించి ఏడాది పాటు 200 ట్రిపులు జాతీయ రహదారులపై ప్రయాణించే అవకాశం కల్పించే కొత్త ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్‌ను ప్రవేశపెట్టింది. ఆగస్టు 15 నుంచి అమలులోకి వస్తుంది. ఇది 200 ట్రిప్పులు లేదా ఒక సంవత్సరం వరకు చెల్లుబాటు అవుతుంది.

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. తరచూ టోల్‌ రోడ్డు వారే వాడికి అదిరిపోయే ప్లాన్‌ తీసుకొచ్చింది. జాతీయ రహదారులపై టోల్ కలెక్షన్ విధానంలో మరో కొత్త విధానం అందుబాటులోకి రానుంది. ఫాస్ట్‌ ట్యాగ్‌పై కేంద్ర రోడ్లు రహదారుల శాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. ఏడాదికి ఒకసారి రిచార్జ్‌ చేసుకుని యాక్టివేషన్ తేదీ నుంచి ఏడాది వరకు లేదా 200 ట్రిప్పులు వరకు తిరిగే వెసులుబాటు తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. ఏడాదికి రూ.3 వేలు చెల్లిస్తే దేశంలో ఎక్కడైనా తిరిగే అవకాశం కల్పిస్తూ కొత్త విధానం తీసుకువచ్చింది కేంద్రం. ఈ ఏడాది ఆగష్టు 15 నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు.


దేశంలో జాతీయ రహదారులపై నిర్బంధ రహిత ప్రయాణాన్ని లక్ష్యంగా పెట్టుకుని, ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్‌ను ప్రవేశపెడుతున్నట్లు గడ్కరీ తెలిపారు. వాణిజ్యేతర, వ్యక్తిగత వాహన దారులు ఈ వార్షిక పాస్ వినియోగించుకోవచ్చు. కార్లు, జీపులు, వ్యాన్లు వంటి వాణిజ్యేతర ప్రైవేట్ వాహనాల కోసం ఈ పాస్ ప్రత్యేకంగా రూపొందించారు. భారత టోల్ వ్యవస్థలో అవినీతికి తావులేకుండా డిజిటల్ రూపంలో టోల్ టాక్స్ కలెక్ట్ చేసేందుకు ఫాస్ట్ ట్యాగ్‌ను కేంద్రం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్షిక పాస్ దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై సజావుగా, ఖర్చుతో కూడుకున్న ప్రయాణాన్ని అనుమతిస్తుంది.
వార్షిక పాస్ యాక్టివేషన్, రెన్యూవల్‌ కోసం ప్రత్యేక లింక్ త్వరలో రాజ్‌మార్గ్ యాత్ర యాప్‌లో అలాగే NHAI, MoRTH అధికారిక వెబ్‌సైట్‌లలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఈ విధానం 60 కి.మీ పరిధిలో ఉన్న టోల్ ప్లాజాల గురించి దీర్ఘకాలికంగా వాహనదారులకు ఉన్న సమస్యలను పరిష్కరిస్తుంది. ఒకేసారి రీఛార్జ్ ద్వారా టోల్ చెల్లింపులను సులభతరం చేస్తుంది. వేచి ఉండే సమయాన్ని తగ్గించడం, రద్దీని తగ్గించడం టోల్ ప్లాజాల వద్ద వివాదాలను తగ్గించడం ద్వారా, లక్షలాది మంది ప్రైవేట్ వాహన వాహనదారులు వేగవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించడం లక్ష్యంగా వార్షిక పాస్ ఉపయోగపడనుంది. మరి ఇంకేందుకు ఆలస్యం ఎక్కువగా టోల్‌ రోడ్లలను వినియోగించే వారు ఈ ప్లాన్‌ తీసుకోండి.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.