కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హక్కు చట్టం ను రద్దు చేసి, ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గర్ అండ్ అజీవికా మిషన్ (గ్రామీణ్) బిల్, 2025’ (VB-G RAM G బిల్)ను ప్రవేశపెట్టనుంది.
ఈ కొత్త చట్టం ద్వారా గ్రామీణ కుటుంబాలకు 125 రోజుల జీత ఉపాధిని హామీ ఇస్తూ, వికసిత్ భారత్ 2047 దృష్టికి అనుగుణంగా గ్రామీణ అభివృద్ధికి బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. దీనితో దేశవ్యాప్తంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో గణనీయ మార్పులు వస్తాయి. అయితే, మహాత్మా గాంధీ పేరును తొలగించడం, రాష్ట్రాలపై ఆర్థిక భారం పెంచడం వంటి అంశాలు వివాదాస్పదంగా మారాయి.
ఎంజీఎన్ఆర్ఈజీఏకు వీడ్కోలు: కొత్త బిల్లు ఏమిటి?
2005లో అమలులోకి వచ్చిన ఎంజీఎన్ఆర్ఈజీఏ, గ్రామీణ కుటుంబాలకు సంవత్సరానికి 100 రోజుల అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్ను హామీ ఇచ్చింది. దీని ద్వారా లక్షలాది మంది గ్రామీణ కార్మికులకు ఆదాయం, గ్రామీణ మౌలిక సదుపాయాల సృష్టి జరిగాయి. అయితే, గ్రామీణ భారతదేశం మార్పు చెందిందని కేంద్రం ప్రకటించింది. పేదరికం 25.7% నుంచి 4.86%కి తగ్గడం, డిజిటల్ కనెక్టివిటీ పెరగడం వల్ల ఈ చట్టం పాతబడిపోయిందని ముఖ్యంగా, ఫండ్స్ మిస్యూస్ , మెషిన్ల ఉపయోగం, అటెండెన్స్ బైపాస్ వంటి సమస్యలు పరిష్కారం కావాలని ప్రభుత్వం చెబుతోంది.
కొత్త VB–G RAM G బిల్, గ్రామీణ అభివృద్ధికి ‘వికసిత్ భారత్ నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్’ను ఏర్పరుస్తుంది. ఇందులో నాలుగు ప్రధాన అంశాలు ఉంటాయి.
కోర్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ : రోడ్లు, కనెక్టివిటీ వంటి మౌలిక సదుపాయాలు.
వాటర్ సెక్యూరిటీ : వాటర్ హార్వెస్టింగ్, ఫ్లడ్ డ్రైనేజ్, సాయిల్ కన్జర్వేషన్.
లైవ్లీహుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ : స్టోరేజ్, మార్కెట్లు, ప్రొడక్షన్ ఆస్తులు.
క్లైమేట్ అడాప్టేషన్ : వాతావరణ మార్పులను తట్టుకునే పనులు
ఈ బిల్లు ప్రకారం, గ్రామ పంచాయతీలు వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్స్ తయారు చేసి, PM గతి-శక్తి వంటి నేషనల్ స్పేషల్ సిస్టమ్స్తో ఇంటిగ్రేట్ చేయాలి.
మార్పులు: ఏమి మారుతుంది?
ఎంజీఎన్ఆర్ఈజీఏతో పోలిస్తే, కొత్త చట్టంలో కీలక మార్పులు ఉంటాయి.
ఉపాధి రోజులు : 100 నుంచి 125 రోజులకు పెరుగుతాయి.
ఫండింగ్ మోడల్ : డిమాండ్-బేస్డ్ నుంచి నార్మేటివ్ ఫండింగ్కు మార్పు. బడ్జెట్ ప్రెడిక్టబుల్గా ఉంటుంది, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్గా మారి 60:40 కేంద్రం:రాష్ట్రాలు కాస్ట్-షేరింగ్. నార్త్-ఈస్ట్, హిమాలయన్ స్టేట్స్కు 90:10, యూటీలకు 100% కేంద్రం ఇస్తుంది.
ప్లానింగ్ : డిమాండ్-బేస్డ్కు బదులు హైపర్లోకల్, స్పేషల్ ఇంటిగ్రేటెడ్ ప్లాన్స్.
పనులు: పొలం పనులు ఉన్న సమయంలో సీజన్లో 60 రోజుల వరకు పనులు చేయకూడదు వర్క్ ఇవ్వకపోతే అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్; బయోమెట్రిక్/ఆధార్ వెరిఫికేషన్ ఉంటుంది.
ఈ మార్పులతో గ్రామీణ ఎకానమీలో వలసలు తగ్గి, ఆదాయాలు పెరిగి, పర్యావరణానికి మేలు పెరుగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.
విపక్షాలు ఈ బిల్లును తీవ్రంగా విమర్శిస్తున్నాయి. గాంధీ పేరును తొలగించడం జాతిపితకు అవమానం అని అంటున్నారు
ఈ బిల్లు పాసైతే, గ్రామీణ కార్మికులకు ఎక్కువ ఆదాయం, ఫార్మర్లకు లేబర్ అందుబాటు, రూరల్ ఎకానమీలో కన్జంప్షన్ పెరుగుదల రావచ్చు. అయితే, రాష్ట్రాల ఆర్థిక భారం, డిజిటల్ గ్యాప్లు సవాళ్లుగా మిగులుతాయన్న వాదన వినిపిస్తోంది.




































