పీఎఫ్‌ సేవలపై బడ్జెట్‌పై కేంద్రం కీలక ప్రకటన.. అది రూ.25 వేలకు పెంపు.. వారికి కూడా బెనిఫిట్

బడ్జెట్‌లో ఈపీఎఫ్‌వో ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ఈపీఎఫ్ కనీస వేతన పరిమితిని పెంచనుందని సమాచారం.

ఇప్పటివరకు కనీస లిమిట్ రూ.15 వేలుగా ఉండగా.. ఎన్నో ఏళ్లుగా అందులో ఎలాంటి మార్పలు జరగలేదు. దీంతో మరింత మంది ఉద్యోగులకు ఉపయోగపడేలా కనీస వేతన పరిమితిని పెంచాలనే డిమాండ్లు ఉద్యోగ సంఘాల నుంచి వినిపిస్తున్నాయి. దీని వల్ల మరింత మంది ఈపీఎఫ్‌వో పరిధిలోకి రావడం వల్ల ప్రయోజనం జరుగుతుందని డిమాండ్ చేస్తోంది. ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న ఈ డిమాండ్‌పై ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో కేంద్రం నిర్ణయం తీసుకోనుందని సమాచారం. దీని వల్ల మరింతమంది ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఈపీఎఫ్ సౌకర్యం పొందనున్నారు.


రూ.25 వేలకు పెంపే ఆలోచనలో కేంద్రం..

ప్రస్తుతం ఈపీఎఫ్‌వో కనీస వేతన పరిమితి రూ.15 వేలుగా ఉంది. దీనిని రూ.25 వేలకు పెంచే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. 12 ఏళ్లుగా బేసిక్ శాలరీ లిమిట్‌లో మార్పులు లేవు. దీంతో దశాబ్దం తర్వాత దీనిపై కొత్త నిర్ణయానికి ప్రభుత్వం నాంది పలుకబోతుందని సమాచారం. ఈ లిమిట్‌ను పెంచడం వల్ల లక్షలాది మంది ప్రైవేట్ ఉద్యోగులు కొత్తగా పీఎఫ్ సౌకర్యం, పెన్సన్ సౌకర్యం పొందనున్నారు. చివరిసారిగా 2014లో వేతన పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు రూ.6 వేలుగా ఉండగా.. దానికి అప్పట్లో రూ.15 వేలు పెంచారు. ఆ తర్వాత ఇక ఎలాంటి మార్పులు జరగలేదు. పెరిగిన ఖర్చులు, వేతనాలను దృష్టిలో పెట్టుకుని పెంచాలని ఉద్యోగ సంఘాల నుంచి పెద్ద ఎత్తున ప్రతిపాదనలు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు దానికి మోక్షం లభించనుంది.

ఏప్రిల్ 1 నుంచి వర్తించే అవకాశం

ఈపీఎఫ్ బేసిక్ శాలరీ లిమిట్‌ను రూ.25 వేలకు పెంచడంపై బడ్జెట్లో ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. లిమిట్‌ను రూ.25 వేలకు పెంచడం వల్ల కొత్తగా కోటి మంది ఈపీఎఫ్ పరిధిలోకి రానున్నారు. దీంతో వారికి కూడా పెన్షన్ ప్రయోజనాలు ఉంటాయి. అయితే ఇది పెంచడం వల్ల పీఎఫ్ కంట్రిబ్యూషన్ పెరగనుంది. దీని వల్ల చేతికి వచ్చే శాలరీ స్వల్పంగా తగ్గే అవకాశముంది. కానీ దీర్ఘకాలంలో పీఎఫ్ నిధులు ఎక్కువ ఉండటం వల్ల అధిక వడ్డీ లభిస్తుంది. అలాగే పెన్షన్ అమౌంట్ కూడా పెరగడం వల్ల 60 ఏళ్ల తర్వాత ఉపయోగం ఉంటుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.