Bomb Threat: ఉలిక్కిపడిన నగరం.. మీ స్కూళ్లో బాంబు పెట్టాం.. 60కిపైగా బడులకు బెదిరింపులు

www.mannamweb.com


బాంబు బెదిరింపుతో(Bomb Threat) దేశ రాజధానిలో 60కిపైగా పాఠశాలలు వణికిపోయాయి. దీంతో అన్ని బడులకు సెలవులు ప్రకటించి.. విద్యార్థులను ఇళ్లకు పంపించివేశారు. ఢిల్లీ, నోయిడా ప్రాంతాల్లో పదుల సంఖ్యలో స్కూళ్లకు ఏకకాలంలో బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది.

ఢిల్లీ: బాంబు బెదిరింపుతో(Bomb Threat) దేశ రాజధానిలో 60కిపైగా పాఠశాలలు వణికిపోయాయి. దీంతో అన్ని బడులకు సెలవులు ప్రకటించి.. విద్యార్థులను ఇళ్లకు పంపించివేశారు. ఢిల్లీ, నోయిడా ప్రాంతాల్లో పదుల సంఖ్యలో స్కూళ్లకు ఏకకాలంలో బాంబు బెదిరిం

పులు రావడం తీవ్ర కలకలం రేపింది. 60కిపైగా పాఠశాలలకు ఈ మెయిల్‌ ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు దిగారు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు పిల్లలను తీసుకెళ్లారు. విద్యార్థులు వెళ్లిన తరువాత అన్ని బడుల్లో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేసింది. తొలుత షాలిమార్ గార్డెన్‌లోని కాన్వెంట్ పాఠశాలకు మే 1న ఉదయం 7 గంటలకు మెయిల్ వచ్చింది. పాఠశాల యాజమాన్యం వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. వారు వచ్చి పాఠశాలను తనిఖీ చేసినా.. బాంబు లభ్యం కాలేదు.

అలా 60కిపైగా పాఠశాలలకు బెదిరింపు కాల్స్ వెళ్లాయి. ఒకే వ్యక్తి అన్ని పాఠశాలలకు మెయిల్స్ పంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. డీసీపీ అపూర్వ గుప్తా మాట్లాడుతూ.. ఇవాళ ఉదయం నుంచి అనేక పాఠశాలలకు మెయిల్స్ వెళ్లాయి. అన్ని మెయిళ్ల సారాంశం ఒకటేనని.. పాఠశాలలో బాంబు పెట్టినట్లు అందులో ఉందని తెలిపారు.

ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి మాట్లాడుతూ.. విద్యార్థులు, తల్లిదండ్రులు కంగారు పడాల్సిన అవసరం లేదని.. బడుల్లో బాంబును గుర్తించలేదని తెలిపారు. అవసరమైన చోట పాఠశాలల అధికారులు తల్లిదండ్రులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. ఈ మెయిల్ పంపడానికి ఉపయోగించిన ఐపీ అడ్రస్ సర్వర్ విదేశాల్లో(రష్యా) ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వీలైనంత త్వరలో నిందితుడి వివరాలు తెలుసుకుంటామని చెబుతున్నారు.

నిలిచిన పరీక్షలు..

బాంబు బెదిరింపు కారణంగా ఢిల్లీలోని వివిధ పాఠశాలల్లో జరగాల్సిన పరీక్షలు నిలిచిపోయాయి. వాయిదా పడిన పరీక్షల షెడ్యూల్‌ని త్వరలో వెల్లడిస్తామని పాఠశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి.