వివాదాస్పదంగా మారిన ట్రాఫిక్ పోలీసుల వ్యవహారం..

విజయవాడ నగరంలో ట్రాఫిక్ పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్న వాహన చోదకుల పట్ల వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు కారణమవుతోంది..


నగర వ్యాప్తంగా పోలీసులు స్పెషల్ డ్రైవ్ ల పేరుతో హెల్మెట్లు ధరించని, లైసెన్స్ లేని వాహనాలను గుర్తించి.. వారికి జరిమానాలు విధిస్తున్నారు.. జరిమానాలు విధించడంతో పాటుగా వాళ్లకి అవగాహన కూడా కల్పిస్తున్నారు. అయితే, ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఈ వ్యవహారం అంతా రిల్స్ రూపంలో మార్చి అప్‌లోడ్‌ చేస్తున్నారు.. ఇదంతా ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే అని పోలీసులు చెబుతున్నారు. ఇక్కడ వరకు వ్యవహారం బానే ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న అతి.. వాహన దారులకు ఇబ్బంది కలిగిస్తోంది. జరిమానాలు విధిస్తే చెల్లిస్తామని అలా కాకుండా సోషల్ మీడియాలో తమ వీడియోలను పోస్ట్ చేయటంపై మండిపడుతున్నారు వాహన చోదకులు.

వాహన చోదకులను ఆపి వాళ్ల వీడియోలు తీసి సోషల్ మీడియాలో ట్రాఫిక్ పోలీసులు యూట్యూబ్‌లో ద్వారా అప్‌లోడ్ చేయించే వ్యవహారం వివాదాస్పదంగా మారింది.. ఇదే విషయంపై సిపి రాజశేఖర్ బాబు వరకు వ్యవహారం వెళ్లడంతో అవగాహన కల్పించే వరకు వీడియోలను రీల్స్ తీయమని చెబుతున్నామని అంతకుమించి ఇబ్బంది కలిగేలా ఉంటే మాత్రం చర్యలు తీసుకుంటామని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇంత జరిగిన తర్వాత కూడా పోలీసుల తీరులో మాత్రం మార్పు రాలేదనేది తాజా ఘటనతో తెలుస్తోంది. BRTS రోడ్డులో 2 రోజుల క్రితం ఇదే విషయంలో ఉద్రిక్తతకు కారణమైంది. ఫుడ్ జంక్షన్ లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు చేస్తూ యూ ట్యూబర్లతో కలిసి రీల్స్ చేస్తున్నారు. యువకులను మందలిస్తున్నట్టు వీడియోలు చేసే క్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ బూతులు తిట్టదంతో వివాదం మొదలైంది. దీంతో పోలీసులకు యువకులు వాగ్విదానికి దిగారు. పోలీసుల తీరును తప్పుపట్టారు. దీంతో ట్రాఫిక్‌ పోలీసులు అదనపు సిబ్బందిని ఘటన స్థలానికి పిలిపించారు. యువకులకు సీఐ స్థాయి అధికారి వచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కాలర్ మైక్ పెట్టుకుని విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో తమను ఏదో తప్పు చేసినట్టు గా పోలీసులు చూపించటం ద్వారా అవమానిస్తున్నారని యువకులు ఆవేదన వ్యక్త చేస్తున్నారు. చాలానాలు చెల్లిస్తామని చెప్పినప్పటికీ ఈ విధంగా రీల్స్ చేస్తూ వాటిని యూట్యూబ్‌లో పోస్ట్ చేయడం సరికాదని నగరవాసులు అంటున్నారు.. ఇకనైనా సీపీ ఈ వ్యవహారంపై దృష్టి సారించి ట్రాఫిక్ పోలీసుల అతిపై నియంత్రణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు..

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.