ఈజిప్ట్ పిరమిడ్ల వెనుక అంతుచిక్కని రహస్యాలు.. తాజా పరిశోధనల్లో సంచలన విషయాలు

www.mannamweb.com


ఈజిప్ట్ పిరమిడ్స్‌.. ఈ పేరువినగానే మనకు మొదట గుర్తొచ్చేది ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటి. అత్యద్భుత నిర్మాణాలకు నెలవు. శాస్త్ర సాంకేతికంగా ఇంత ఎదిగిన ప్రస్తుతం ఇలాంటి నిర్మాణాలు చేపట్టారంటే ఒక అర్థం ఉంది.

అదే అసలు ఎలాంటి టెక్నాలజీ లేని కాలంలో.. అంటే దాదాపు 4వేల ఏళ్ల క్రితం ఈ అద్భుత నిర్మాణాలను ఎలా చేపట్టారన్నది ఇప్పటికే అంతు చిక్కని ఓ రహస్యమే. క్రీ.పూ. 2886-2160 నాటికి చెందిన ఇవి అత్యంత పురాతనమైన ఈజిప్టు నాగరికతకు ప్రతిబింబంగా నిలుస్తున్నాయి.

ఈజిప్టులో 700కు పైగా పిరమిడ్లు ఉన్నాయి. వీటిలో ఈజిప్టు రాజులను సమాధి చేశారు. ఈ పిరమిడ్ల నిర్మాణానికి దాదాపు వెయ్యి సంవత్సరాలు పట్టి ఉండవచ్చునని చరిత్ర కారుల అంచనా. పిరమిడ్లలో కైరో నగరానికి శివారులో గిజా దగ్గర నిర్మించినవి చాలా పెద్దవి. ఇక్కడ ప్రఖ్యాత గిజా కాంప్లెక్స్‌ సహా 31 పిరమిడ్లను ఎలా నిర్మించారన్న దానికి సంబంధించి ఇప్పటి వరకు ఒక స్పష్టమైన కారణం ఏంటన్న దానిపై మాత్రం స్పష్టత లేదు. ఈజిప్టు పిరమిడ్స్ వెనుక అంతుచిక్కని రహస్యాలను ఛేదించేందుకు చరిత్రకారులు, పురాతన పరిశోధకలు ఎన్నో పరిశోధనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.వీరు ఏళ్లుగా ఈ పరిశోధనల్లో తలమునకలవుతున్నారు.