ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ఐదవ తరగతి మ్యాథ్స్ పజిల్.. దీనికి ఆన్సర్ చెప్పడం మీ వల్ల కాదు!
Math Puzzle: వివిధ రకాల పజిల్స్ సాల్వ్ చేస్తుంటే మనకు మంచి టైమ్ పాస్ అవుతుంది. రెండు పిక్చర్స్ మధ్య తేడా కనిపెట్టడం, మిస్ అయిన వస్తువును గుర్తించడం, ఆప్టికల్ ఇల్యూషన్స్, పిక్చర్ పజిల్స్ కాస్త ఈజీగానే ఉంటాయి.
కానీ మ్యాథ్స్ పజిల్స్ (Math Puzzle) మాత్రం అందరికీ అర్థం కావు. వీటిని సాల్వ్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. గణిత సూత్రాలు తెలిసిన వారు కూడా కొన్నిసార్లు వీటికి పరిష్కారం కనిపెట్టలేరు. ఇలాంటి పజిల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి మీరు ఆన్సర్ కనిపెడతారేమో చెక్ చేసుకోండి.
ఈ ఇమేజ్ చూడండి. దీంట్లో ఒక సింపుల్ మ్యాథ్స్ ఈక్వేషన్ ఉంది. నంబర్ 3లు మొత్తం ఐదు ఉన్నాయి. వాటి మధ్య మ్యాథ్స్ సింబల్స్ ఉన్నాయి. 3*3-3/3+3 అనేది అసలు ప్రశ్న. ఎడిషన్, సబ్‌స్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్ చేసి దీనికి సమాధానం కనిపెట్టాలి.
ఐదో తరగతి ప్రశ్న!
చూడటానికి ఇది చాలా సింపుల్‌గా అనిపిస్తుంది. కానీ దీనికి కరెక్ట్ ఆన్సర్ మాత్రం అందరూ కనిపెట్టలేదు. మ్యాథ్స్‌పై మంచి పట్టు ఉన్నవారే సరైన సమాధానం కనిపెట్టగలరు. ఇలాంటివి ఐదవ తరగతి మ్యాథ్స్‌లో నేర్పిస్తారు. చిన్న పిల్లలు కూడా సాల్వ్ చేయగలిగే ఈ ఈక్వేషన్‌కు మీరు కనెక్ట్ ఆన్సర్ కనిపెట్టగలరేమో చూడండి.
ఆన్సర్ ఎంత?
ఈక్వేషన్ 3*3-3/3+3 చూస్తే.. ముందు రెండు మూళ్లను గుణించి, దాంట్లో నుంచి మరో మూడు తీసివేయాలి అనుకుంటారు. ఆ మొత్తాన్ని మూడుతో భాగించి, చివరికి మూడు కలిపితే సమాధానం వస్తుంది అనుకుంటారు. మీరు కూడా ఇలాగే ఆలోచిస్తే, మీ సమాధానం 5 వస్తుంది. ముందు 3*3=9 వస్తుంది. తర్వాత 9-3=6. ఆ తర్వాత దీన్ని మూడుతో భాగిస్తే.. 6/3=2 వస్తుంది. దీనికి మరో మూడు కలిపితే 2+3=5 వస్తుంది. అయితే ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు.
వారికి సింపుల్
ఇలాంటి మ్యాథ్స్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి కొన్ని ప్రాథమిక సూత్రాలు ఫాలో అవ్వాలి. గణితంలో BODMAS రూల్ ఉంటుంది. దీని ప్రకారం ముందు బ్రాకెట్స్, ఆర్డర్స్.. ఆ తర్వాత డివిజన్(భాగించడం), మల్టిప్లికేషన్ (గుణించడం) చేయాలి. చివరకు ఎడిషన్ (కూడిక), సబ్‌ట్రాక్షన్ (తీసివేత) ఈక్వేషన్ ఆర్డర్‌లో అంటే ఎడమ నుంచి కుడికి చేయాలి.
అసలు ఆన్సర్ ఇదే..
మనకు ఇచ్చిన సమీకరణం: 3*3-3/3+3
BODMAS రూల్ ప్రకారం.. ఈక్వేషన్‌లో ముందు సంఖ్యలను భాగించాలి. అంటే 3/3=1 అవుతుంది.
దీంతో సమీకరణం 3*3-1+3 అవుతుంది.
తర్వాత గుణకారం చేయాలి. అంటే 3*3= 9 వస్తుంది.
ఇప్పుడు ఈక్వేషన్ 9-1+3 గా మారుతుంది. ఇక్కడ ఆర్డర్ ప్రకారం 9 నుంచి 1 తీసివేస్తే 8 వస్తుంది. దీనికి 3 కలిపితే 11 వస్తుంది. ఇదే మనకు ఇచ్చిన సమీకరణానికి సరైన సమాధానం.